Kadiam Srihari Comments On Parties: 30 సంవత్సరాలుగా రాజకీయాల్లో తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న నాయకుడు కడియం శ్రీహరి(Kadiam Srihari ). మచ్చలేని రాజకీయ నాయకుడిగా కొనసాగుతున్న ఆయన ఒక్కసారిగా స్వరాన్ని మార్చారు. మొన్నటి ఎన్నికల్లో గెలిచిన నాటి నుంచి వివాదాస్పద వ్యాఖ్యలు, సెన్సేషన్ కామెంట్స్ చేస్తూ వార్తల్లో నిలుస్తున్నారు.


వివాదరహితుడిగా పేరు 


కడియం శ్రీహరి. వివాద రహితుడిగా, మచ్చలేని నాయకుడు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో మంత్రిగా, తెలంగాణ ఉపముఖ్యమంత్రిగా పనిచేసిన కడియం మొన్నటి అసెంబ్లీ ఎన్నికల తరువాత సెన్షేషనల్ కామెంట్స్ చేస్తూ దూమరం రేపుతున్నారు. ఈ మధ్య ఆయన చేస్తున్న వ్యాఖ్యలు తరచూ రాజకీయ చర్చకు దారి తీస్తున్నాయి. 


కామెంట్స్‌పై దుమారం 


ఉమ్మడి వరంగల్ జిల్లా స్టేషన్ ఘన్ పూర్ (Station Ghanpur)ఎమ్మెల్యేగా విజయం సాధించిన తరువాత విజయోత్సవ ర్యాలీలో ఆరు నెలలో... సంవత్సరమో... కాంగ్రెస్ ప్రభుత్వం కూలిపోతుందన్నారు. అధికారంలోకి వచ్చేది టీఆర్ ఎస్ పార్టీనేనని జోస్యం చెప్పారు. కార్యకర్తలు అధైర్య పడాల్సిన అవసరంలేదని అన్నారు. సౌమ్యుడిగా పేరు ఉన్న ఆయన చేసిన ఈ కామెంట్స్ అప్పట్లో రాష్ట్ర వ్యాప్తంగా పెద్ద దూమరలేచింది. 


కాంగ్రెస్  ప్రభుత్వం కూలిపోతుందని జోస్యం


అంతటితో ఆగకుండా కొద్ది రోజులకే జనగామ కేంద్రంలో సైతం అదే వాడి వేడిని కొనసాగించారు. కేసీఆర్ రెండు అడుగులు వెనక్కి వేశారంటే జంప్ చేయడానికేనని కడియం అన్నారు. పనిలో పనిగా కాంగ్రెస్ పార్టీపై కూడా విమర్శలు చేసారు. ఆ పార్టీ ఒక ఉసిరికాయల, కప్పుల తట్టఅని సంభోదించారు. కడియం వ్యాఖ్యలపై రాష్ట్ర వ్యాప్తంగా దుమారం లేచిన ఆయన తన వ్యాఖ్యలను సమర్దించుకున్నారు. కడియం శ్రీహరి మాటలకు స్పష్టత ఉంటుందని ఆయన వ్యాఖ్యలు నిజమే కావచ్చు అనే చర్చ జరిగింది. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన నాటి నుంచి ప్రభుత్వం కులుతుంది అని వ్యాఖ్యలతో పాటు విమర్శలు చేస్తున్నారు. 


టీఆర్‌ఎస్‌ పునఃప్రారంభించాలని డిమాండ్


కొద్ది రోజుల క్రితం సొంతపార్టీ పేరును బీఆర్ఎస్ నుంచి టీఆర్‌ఎస్‌గా మార్చాలని చేసిన కామెంట్స్ దుమారమే రేపాయని చెప్పవచ్చు. మొన్నటికి మొన్న కడియం శ్రీహరి తన నియోజకవర్గంలోని ఓ కార్యక్రమంలో మాట్లాడుతూ రాష్ట్రంలో యువత పెడదారి పడుతుంది బెల్ట్ షాప్‌లను నిరోదించాలని, మత్తు మత్తు పదార్థాల రవాణాకు అడ్డుకట్ట వేయాలని వ్యాఖ్యలు చేశారు. అయితే ఈ వ్యాఖ్యలపై ఆయా పార్టీనేతల్లో చర్చ జరిగింది. 


కడియం శ్రీహరి కామెంట్స్‌పై మంత్రి సీతక్క కౌంటర్


బీఆర్ ఎస్ అధికారంలో ఉన్నప్పుడే బెల్ట్ షాప్‌లు విచ్చలవిడిగా పెరిగాయని నేతలు గుసగుసలాడుకున్నారు. మొన్నటి మొన్న ఎస్సీ వర్గీకరణపై బీజేపీ నమ్మకంలేదని చెబుతూనే రాష్ట్ర ప్రభుత్వం సుప్రీం కోర్టులో రిజర్వేషన్‌కు అనుకూలంగా అఫిడవిట్ దాఖలు చేయాలని డిమాండ్ చేశారు. ఆచితూచి మాట్లాడే కడియం శ్రీహరి ఇలా తరుచు రాజకీయంగా దూమరం లేపే వ్యాఖ్యలు చేస్తుండడంపై ఆసక్తి నెలకొంది. కాంగ్రేస్ ప్రభుత్వంపై కడియం చేస్తున్న వ్యాఖ్యలపై మంత్రి సీతక్క ఘాటుగానే స్పందించారు. శ్రీహరికి ప్రజాస్వామ్యంపై నమ్మకం లేదని, అధికారం దూరం కావడంతో ఇష్టం వచ్చినట్లు మాట్లాడుతున్నారని సీతక్క అన్నారు.