- సోమేశ్ కుమార్ అవినీతి, అక్రమాలు, అనాలోచిత నిర్ణయాలపై విచారణ జరపాల్సిందే
- యువకులారా.... కేసీఆర్ పాలనను బొందపెట్టేదాకా ఉద్యమించండి
- కొల్లాపూర్ పాదయాత్ర ముగింపు బహిరంగ సభలో బండి సంజయ్ వ్యాఖ్యలు


317 జీవో తీసి ఉద్యోగుల ఉసురు పోసుకున్న సీనియర్ ఐఏఎస్, తెలంగాణ మాజీ సీఎస్ సోమేశ్ కుమార్‌కు ఉసురు తాకిందని, హైకోర్టు చెంప చెళ్లు మన్పించిందన్నారు బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్. ఇన్నేళ్లుగా సీఎస్ గా సోమేశ్ కుమార్ చేసిన దుర్మార్గులు, అవినీతి, అక్రమాలు, అనాలోచిత నిర్ణయాలపై విచారణ జరపాల్సిందే. సీఎస్ పై క్రిమినల్ కేసు పెట్టి ఆయన సంగతి చూడాల్సిందేనని డిమాండ్ చేశారు. తెలంగాణ కేడర్ లో ఎంతోమంది సత్తా ఉన్న అధికారులున్నా వారికి సరైన పోస్టింగులివ్వడం లేదన్నారు. ఏపీ క్యాడర్ ను అడ్డుపెట్టుకుని రబ్బర్ స్టాంపులా వాడుకుని అవినీతి సొమ్మను దోచుకుంటున్నరు.  ఇప్పటికైనా హైకోర్టు తీర్పుతో బుద్ది తెచ్చుకుని ఉద్యోగుల విభజన ప్రక్రియను పూర్తి చేయాలి. తెలంగాణ క్యాడర్ అధికారులకు పోస్టింగులు ఇవ్వాలని కోరారు.


మొన్నటిదాకా ప్రధాని మోదీ గొప్పోడు... మంచోడని పొగిడిన సీఎం కేసీఆర్. ఏనాడూ తెలంగాణకు నిధులివ్వాలని ఎందుకు అడగలేదు? కేసీఆర్ అవినీతి, అక్రమాలపై కేంద్రం డేగ కన్నుతో చూస్తూ విచారణకు సిద్ధమవ్వడంతో తట్టుకోలేక కేంద్రాన్ని నిందించడమే పనిగా పెట్టుకున్నారు. కేసీఆర్ కుటుంబం చేసే లంగా దందాలపై విచారణ జరిపి తీరుతాం. కేసీఆర్ బిడ్డ రూ.100 కోట్లతో దొంగ సారా దందా చేసింది. ఆమెను ఎందుకు అరెస్ట్ చేయొద్దని ప్రశ్నించారు బండి సంజయ్. 


కొల్లాపూర్, తెలంగాణ అభివృద్ధికి, రోడ్లకు నిధులివ్వని కేసీఆర్... తన కుటుంబం చేసే లంగా దందాలకు మాత్రం వందల కోట్లు ఇయ్యడం సిగ్గు చేటు. కేసీఆర్ కుటుంబ అక్రమాలపై, తెలంగాణ అభివ్రుద్ధిపై ప్రజల్లో చర్చ జరకుండా ఉండేందుకు బీఆర్ఎస్ పేరుతో డ్రామాలాడుతున్నరని విమర్శించారు. తెలంగాణ ప్రజల కోసం మేం పోరాటాలు చేస్తుంటే మాపై క్రిమినల్ కేసులు పెడుతూ జైలుకు పంపుతున్నడు. హిందువులంతా కొలిచే అయ్యప్ప స్వామిని కించపరుస్తున్నడు. హిందూ దేవుళ్లను కించపరుస్తున్నరు. బీజేపీ మాత్రమే స్పందించాల్సి వస్తోంది. అంబేద్కర్ ను కించపర్చినా, ఛత్రపతి శివాజీని కించపర్చినా బీఆర్ఎస్ స్పందించదు. ఎన్నికలప్పుడు మాత్రం నాకంటే నిఖార్సయిన హిందువు ఎవరూ లేరని గొప్పలు చెప్పుకునే కేసీఆర్... ఎన్నికలయ్యాక హిందువులంతా బొందుగాళ్లుగా చిత్రీకరిస్తున్నారంటూ బండి సంజయ్ మండిపడ్డారు.


బీజేపీ బరాబర్ హిందూ ధర్మరక్షణ కోసం పనిచేస్తదని, అందుకోసం ఎంతదాకైనా పోరాడతదని స్పష్టం చేశారు. ఇయాళ జాతీయ యువజన దినోత్సవం. యువతకు స్పూర్తి ప్రదాత స్వామి వివేకానందుడి జయంతి సందర్భంగా ఆయన స్పూర్తితో కేసీఆర్ పాలనపై చరమ గీతం పాడదాం. వివేకానంద చెప్పినట్లు యువత ముందుకు రావాలి. తెలంగాణలో రామరాజ్యం, ప్రజాస్వామ్య ప్రభుత్వం, పేదల రాజ్యం రావాలంటే తెలంగాణలోని యువత పూర్తి సమయం కేటాయిస్తే కేసీఆర్ సంగతి చూస్తామన్నారు.


యువతకు న్యాయం జరగాలన్నా, ఉద్యోగాలు రావాలన్నా... తెలంగాణ అమరుల ఆశయాలు నెరవేరాలంటే బీజేపీ అధికారంలోకి రావాలన్నారు. టీడీపీ, టీఆర్ఎస్, కాంగ్రెస్ లకు అధికారం ఇచ్చారని, ఒక్కసారి బీజేపీకి అవకాశమివ్వాలని రాష్ట్ర ప్రజలను బండి సంజయ్ కోరారు.