Continues below advertisement


BRS Politics :   తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్.. మూడో సారి విజయం సాధించేందుకు పక్కాగా ప్రణాళికలు వేసుకుంటున్నారు. అక్టోబల్‌లో ఎన్నికలు వచ్చే అవకాశం ఉన్నందున ముందుగానే అభ్యర్థుల జాబితాను ఖరారు చేసి ప్రకటించాలని అనుకుంటున్నారు. కనీసం మూడు నెలల ముందు ప్రకటించడం ద్వారా అభ్యర్థులు పూర్తి స్థాయిలో ప్రజల్లోనే ఉండేలా అవకాశం కల్పించాలనుకుంటున్నారు. లాస్ట్ మినిట్ లో ఎవరైనా వెనుకబడినట్లుగా అనిపిస్తే కొత్త వారికి  బీ ఫాం ఇవ్వవొచ్చన్న ప్లాన్ లో ఉన్నట్లుగా చెబుతున్నారు. ఇప్పటికే జిల్లాల పర్యటనలకు వెళ్లినప్పుడు ఎవరికి టిక్కెట్లు ఉంటాయో.. ఎవరికి ఉండవో.. కేసీఆర్ ఇచ్చే ప్రాధాన్యం బట్టి వారికి అక్కడి ఎమ్మెల్యేలకు క్లారిటీ వస్తోందంటున్నారు.  


గతంలో అసెంబ్లీని రద్దు చేసిన రోజే అభ్యర్థుల ప్రకటన 


2018లో ముందస్తు అసెంబ్లీ ఎన్నికలకు వెళ్లిన కేసీఆర్‌.. ప్రభుత్వ రద్దు ప్రకటనతోపాటే ఆ ఎన్నికల్లో పార్టీ తరఫున పోటీచేసే అభ్యర్థుల పేర్లను కూడా ప్రకటించేశారు. అప్పుడు ఎన్నికలకు సుమారు మూడు నెలల ముందే ఒకేసారి 105 మంది జాబితాను విడుదల చేయడం సంచలనం సృష్టించింది. అదే తరహాలో ఈసారి అసెంబ్లీ ఎన్నికలకు మూడు నెలల ముందే అభ్యర్థులను ప్రకటించేలా కేసీఆర్‌ కసరత్తు చేస్తున్నారు.  వచ్చే ఎన్నికల్లో పోటీ కోసం బీఆర్‌ఎస్‌లో తీవ్రపోటీ నెలకొనడం, సిట్టింగ్‌ ఎమ్మెల్యేల్లో పనిమంతులకే తిరిగి టికెట్‌ దక్కుతుందని ఇప్పటికే స్పష్టతనిచ్చారు. చివరి నిమిషంలో టిక్కెట్లు ఖరారు చేస్తే అసంతృప్తి ప్రభావం చూపిస్తుందని  మూడు నెలల ముందుగానే  చెబితే.. వెళ్లేవాళ్లు వెళ్తారని ఉండేవాళ్లు ఉంటారని అనుకుంటున్నట్లుగా బీఆర్ఎస్ ఉన్నత స్థాయి వర్గాలు చెబుతున్నాయి. 


మంచి ముహుర్తం చూసుకుని  అభ్యర్థుల ప్రకటన 


మంచి ముహుర్తం చూసుకుని అభ్యర్థులను ప్రకటించే అవకాశం ఉంది.  జూలై మూడో వారం నుంచి నెలాఖరు మధ్యలో బీఆర్‌ఎస్‌ అభ్యర్థుల జాబితాను ప్రకటించే అవకాశం ఉంది. ఈ తొలి జాబితాలో సుమారు 90 మంది అభ్యర్థుల పేర్లు ఉండే అవకాశం ఉందని.. గణనీయంగానే సిట్టింగ్‌ ఎమ్మెల్యేలకు టికెట్ల కోత పడొచ్చని ప్రచారం జరుగుతోంది. సుమారు 25 మందికి  మళ్లీ పోటీచేసే అవకాశం దక్కకపోవచ్చని పార్టీ వర్గాలు చెప్తున్నాయి. టికెట్ల కోసం పారీ్టలో తీవ్ర పోటీ ఉన్న సీట్లు, విపక్షాల ఎత్తుగడలు, ఇతర పారీ్టల నుంచి బలమైన నేతల చేరికకు అవకాశం ఉన్నచోట్ల ఎంపికను చివరి నిమిషం వరకు ఆపే అవకాశం ఉందని అంటున్నాయి. నలభై స్థానాల్లో పోటీ ఎక్కువగా ఉంది. ఎంపీలు, ఎమ్మెల్సీలు, కార్పొరేషన్‌ చైర్మన్లతోపాటు ఇతర ఆశావహులు కలుపుకొని సుమారు 70 మంది బలమైన నేతలు ఎమ్మెల్యే టికెట్‌ ఆశిస్తున్నారు. వీరిలో టిక్కెట్లు లభించకపోతే కొంత మంది బయటకు వెళ్లిపోతారు.  అభ్యర్థుల జాబితాను ముందస్తుగా ప్రకటించడం ద్వారా నష్ట నివారణ చర్యలు చేపట్డడం సులభం అమవుతుందని కేసీఆర్ అంచనా వేస్తున్నట్లుగా తెలుస్తోంది.  


గత ఎన్నికల నాటి వ్యూహమే ! 


ఎమ్మెల్యే అభ్యర్థులను ప్రకటించడం ద్వారా అసంతృప్త నేతలను బుజ్జగించడం, సాధ్యంకాని పక్షంలో సాగనంపడ ం చేయాలని కేసీఆర్‌ భావిస్తున్నట్టు సమాచారం. బీఆర్‌ఎస్‌ నుంచి ఇతర పారీ్టల్లోకి వెళ్లే అవకాశమున్న నేతల జాబితాను కేసీఆర్‌ సిద్ధం చేసుకున్నారు. వారిని వీలైనంత వరకూ బుజ్జగించడానికి లేకపోతే. వెళ్లిపోయినా  ప్రభావం లేకుండా చేయడానికి కేసీఆర్ ప్లాన్ చేసుకుంటున్నారు. మొత్తంగా కేసీఆర్ అసంతృప్తి భయంతో అభ్యర్థుల ప్రకటనను ఆలస్యం చేసే అవకాశం లేదని.. వీలైనంత త్వరగా ప్రకటిస్తారని క్లారిటీ వచ్చింది.