TDP Janasena Manifesto For Andhra Pradesh Assembly Elections : 2024లో ఆంధ్రప్రదేశ్(Andhra Pradesh) లో అధికారంలోకి రావడమే ధ్యేయంగా తెలుగుదేశం పార్టీ (Telugu Desam Party )కసరత్తు చేస్తోంది. తెలుగుదేశం పార్టీ అధికారంలోకి రావడానికి రకరకాల పథకాలను ప్రకటిస్తోంది. సైకో పోవాలి సైకిల్ రావాలి అనే నినాదంతో ప్రజల్లోకి వెళ్లాలని నిర్ణయించింది. 2024లో విజయకేతనం ఎగరవేయడానికి టీడీపీ నాయకులు, కార్యకర్తలూ ప్రతి ఒక్కరూ కృషి చేస్తున్నారు. ఈ తరుణంలో లోకేష్ పాదయాత్ర(Lokesh Padayatra )తో రంగంలోకి దిగారు. లోకేష్ పాదయాత్రకు ప్రజల్లో మంచి గుర్తింపు వచ్చింది. అదే సమయంలో చంద్రబాబు నాయుడు(Chandrababu Naidu ) స్కిల్ డెవలప్‌మెంట్ కేసు(Skill Development Case)లో అరెస్టు అయ్యారు. ఆ తర్వాత జరిగిన పరణామాల నేపథ్యంలో జనసేన అధినేత పవన్ కళ్యాణ్, టీడీపీతో కలిసి ఎన్నికల్లో పోటీ చేస్తామని ప్రకటించారు. రెండు పార్టీల మధ్య సీట్ల సమన్వయానికి కో ఆర్డికేషన్ కమిటీలు ఏర్పాటు చేసుకున్నాయి. జనసేన-టీడీపీల ఉమ్మడి మేనిఫెస్టోని ఈ రోజు ప్రకటించనున్నారు. ఉమ్మడి మేనిఫెస్టోలో కీలక అంశాలకు ప్రాధాన్యం ఇచ్చినట్లు తెలుస్తోంది. 


టీడీపీ-జనసేన మేనిఫెస్టో కీలక అంశాలు
అమ్మ ఒడికి బదులుగా తల్లికి వందనం పథకాన్ని తేబోతున్నట్లు తెలిసింది. అమ్మ ఒడి పథకంలో ఒక బిడ్డకు మాత్రమే ప్రయోజనం వర్తిస్తే, తల్లికి వందనం మాత్రం ఇంట్లో ఎంతమంది పిల్లలు ఉంటే, అందరికి లబ్దిచేకూర్చేలా చర్యలు తీసుకోనున్నట్లు తెలుస్తోంది. వైయస్సార్ చేయూతలో భాగంగా 45 ఏళ్ల వయసు దాటిన మహిళలకు రూ.18,000ను ప్రభుత్వం ఇస్తోంది. టీడీపీ-జనసేన కూటమి 18 ఏళ్లు దాటిన ప్రతి మహిళకూ నెలకు రూ.1500 ఇస్తానని హామీ ఇవ్వనుంది. రైతులకు ప్రస్తుతం ప్రభుత్వం ఏడాదికి అందిస్తున్న రూ.13,500 అందిస్తోంది. ఇందులో కేంద్రం ఆరు వేలు, రాష్ట్ర ప్రభుత్వం రూ.7,500 ఇస్తున్నాయి.  టిడిపి-జనసేన రూ.15,000 ఇస్తామని చెప్పింది. దానికి తోడు మహిళలకు ఉచిత బస్సు, ఏడాదికి మూడు సిలిండర్లు, నిరుద్యోగులకు నిరుద్యోగ భృతి, ఇంటింటికీ కుళాయిలు, బీసీ రక్షణ చట్టం వంటివి మేనిఫెస్టోలో చేర్చినట్లు తెలుస్తోంది. టిడిపి మేనిఫెస్టోపై కర్ణాటక ప్రభావం పడిందని కొందరు నేతలు భావిస్తున్నారు. కర్ణాటకలో అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ పార్టీ ఇలాంటి హామీలను ఇచ్చి ప్రజలను ఆకట్టుకుంది. దాన్ని ఆసరాగా చేసుకుని టిడిపి కూడా కర్ణాటక మాదిరిగా మేనిఫెస్టోను రూపొందించి ఉండొచ్చని రాయకీయ విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. టిడిపి - జనసేన 2024 ఎన్నికలకు కలిసి పోటి చేస్తున్నాయి. 


ఈ ఎన్నికలు కురుక్షేత్ర యుద్ధమన్న పవన్
 వైసీపీ ప్రభుత్వాన్ని కిందకు దించటమే జనసేన లక్ష్యమని, ఎన్నికల తర్వాత టీడీపీ-జనసేన ప్రభుత్వమే అధికారంలోకి వస్తుందని పవన్‌ ధీమా వ్యక్తం చేశారు. ఈ ఎన్నికలు కురుక్షేత్ర యుద్ధమని జగన్ అంటున్నారని.. కురుక్షేత్ర యుద్ధంలో మేం పాండవులం.. జగన్ సేన కౌరవులని పవన్ కల్యాణ్ విమర్శించారు. జగన్ ఓటమి ఖాయం, మేం అధికారంలోకి రావడం ఖాయమని తెలిపారు. డబ్బుకు అమ్ముడుపోయానని వైసీపీ నేతలు ఆరోపిస్తున్నారని, తనకు డబ్బుమీద, నేలమీద ఎప్పుడూ కోరిక లేదని స్పష్టం చేశారు. ప్రత్యేక పరిస్థితుల్లో మాత్రమే ఓటు చీలకూడదని పొత్తు నిర్ణయం తీసుకున్నట్లు తెలిపారు. తనకు తన పార్టీ కంటే ఈ రాష్ట్రం ముఖ్యమని పవన్ వెల్లడించారు. ముఖ్యమంత్రి పదవి కోసం తాను వెంపర్లాడనని పవన్‌ వెల్లడించారు.