Anchor Shyamala Comments On CM Chandrbabu: సీఎం చంద్రబాబు, మంత్రి నారా లోకేశ్‌పై యాంకర్ శ్యామల (Anchor Shyamala) మరోసారి విమర్శలు గుప్పించారు. తాజాగా, వైసీపీ రాష్ట్ర అధికార ప్రతినిధిగా నియమితులైన ఆమె వైసీపీ అధినేత జగన్‌పై (YS Jagan) విమర్శలకు కౌంటర్ ఇచ్చారు. ఈ మేరకు ట్విట్టర్‌లో ఓ వీడియో విడుదల చేశారు. ప్రజలకు సాయం చేసే విషయంలో పిల్లికి కూడా ఎప్పుడూ బిచ్చం పెట్టని చంద్రబాబు (CM Chandrababu), లోకేశ్‌లను (Nara Lokesh) చూస్తుంటే నవ్వాలో ఏడవాలో అర్థం కాని పరిస్థితి నెలకొందని ఘాటుగా వ్యాఖ్యానించారు. 2 ఎకరాల నుంచి రూ.2 లక్షల కోట్ల వరకూ ఎలా సంపాదించారో చెప్పాలని డిమాండ్ చేశారు. 'వరద బాధితులకు జగన్ ఏం చేశారని ప్రశ్నిస్తున్న మేథావులు దయచేసి కళ్లు తెరవాలి. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక టీడీపీ గూండాలు దాదాపు 200 మందికి పైగా వైసీపీ నేతలు, కార్యకర్తలపై దాడులు చేస్తే వారికి జగన్ అండగా నిలిచి సాయం చేశారు. విశాఖలోని ఫార్మా కంపెనీలో పేలుడు ఘటనలో 17 మంది చనిపోతే ఒక్కో కుటుంబానికి రూ.5 లక్షల సాయం చేశారు. గాయపడ్డ 41 మందికి రూ.లక్ష చొప్పున సాయం చేశారు. విజయవాడలో వరదలు ముంచెత్తితే బాధితులకు రూ.కోటి సాయం అందించారు. ఇప్పటికీ బాధితులకు నిత్యావసరాలు, వాటర్ బాటిళ్లు, పాలు పంపిణీ చేస్తూనే ఉన్నారు. పులివెందులలోని స్కూల్లో ఎంతోమంది విద్యార్థులకు ఉచితంగా చదువు చెప్పిస్తున్నారు. అనారోగ్య సమస్యలతో బాధ పడుతున్న చిన్నారులకు ఉచితంగా ఆపరేషన్లు చేయించారు.' అని వివరించారు.






ఇక ఎన్నికల సమయంలో పాదయాత్ర, ఓదార్పు యాత్రలో జగన్ ఎంతోమంది యువతకు ఉపాధి మార్గాలు చూపించారని శ్యామల గుర్తు చేశారు. ఎంతోమందికి ధన సహాయం చేశారని.. ఎంతోమందికి భరోసా కల్పించారని చెప్పారు. వైఎస్ జగన్ చేసిన సాయం వల్ల ఎన్నో కుటుంబాలు ఈ రోజు సంతోషంగా ఉన్నాయని.. ఎంతోమంది విద్యార్థులు ఉన్నత స్థానంలో ఉన్నారని పేర్కొన్నారు. సీఎం చంద్రబాబు ఇలాంటి సాయాలు ఇదివరకేమైనా చేశారా.? అంటూ ప్రశ్నించారు. అధికారం, మీడియా బలం ఉందని దుష్ప్రచారం చేస్తే అబద్ధాలు నిజాలైపోతాయా.? అంటూ పేర్కొన్నారు. 


ఫైర్ బ్రాండ్లకు పదవులు


వైసీపీ అధినేత జగన్ ఇటీవల వైసీపీ అధికార ప్రతినిధులుగా ఫైర్ బ్రాండ్లకు ప్రాధాన్యం ఇచ్చారు. మాజీ మంత్రి రోజా, యాంకర్ శ్యామల, భూమన కరుణాకర్ రెడ్డి, జూపూడి ప్రభాకరరావులను రాష్ట్ర అధికార ప్రతినిధులుగా నియమించారు. గత ఎన్నికల సమయంలోనూ యాంకర్ శ్యామల.. చంద్రబాబు, పవన్‌లను టార్గెట్ చేశారు. ఓ ఇంటర్వ్యూలో గుంటనక్క డైలాగ్‌తో ఫేమస్ అయ్యారు. వైఎస్ జగన్ తరఫున విస్తృత స్థాయిలో ప్రచారం నిర్వహించారు. టీడీపీ నేతల విమర్శలకు కౌంటర్ ఇస్తూ ఫైర్ బ్రాండ్‌గా పేరు తెచ్చుకున్నారు. ఈ క్రమంలో మహిళా కోటాలో రోజా, శ్యామలకు జగన్ కీలక పదవులు ఇచ్చారు.


Also Read: YS Sharmila: కూటమి సర్కారుకు సిగ్గుచేటు, చంద్రబాబు నోరు విప్పాల్సిందే - షర్మిల డిమాండ్