TS Congress : తెలంగాణ కాంగ్రెస్ నేతలు బిజీ అయిపోయారు. పాదయాత్రలతో నియోజకవర్గాలను చుట్టు ముట్టేస్తున్నారు. పార్టీ అధిష్టానం సీరియస్‌గా తీసుకోవడంతో హాత్ సే హాత్ జోడో అభియాన్ యాత్రలను అంతే సీరియస్‌గా చేస్తున్నారు. ఇటీవల కోమటిరెడ్డి వెంకటరెడ్డి ఢిల్లీలో చేసిన వ్యాఖ్యలు దుమారం రేపాయి. అయితే ఆయన వెంటనే వచ్చి పార్టీ వ్యవహారాల ఇంచార్జ్ కు వివరణ ఇచ్చారు. తాను కూడా పాదయాత్ర చేస్తానని ప్రకటించారు. దీంతో ప్రస్తుతానికి కోమటిరెడ్డిపై చర్యల విషయాన్ని పక్కన పెట్టారు. ఒక్క సారిగా హైకమాండ్ సీరియస్ కావడంతో నేతలంతా ఈ అంతర్గత రాజకీయాలను పక్కన పెట్టి పాదయాత్రల్లో బిజీ అయిపోయారు.
అందరినీ దారిలో పెడుతున్న కొత్త ఇంచార్జ్ థాక్రే !
పార్టీ రాష్ట్ర వ్యవ హారాల ఇన్‌చార్జ్ బాధ్యతలను పార్టీ సీనియర్ నేత, మహా రాష్ట్రకు చెందిన మాజీ మంత్రి మాణిక్‌రావు ఠాక్రేకు అప్ప గించాక.. సీనియర్ నేతలు గాడిలో పడినట్లుగా కనిపిస్తోంది. థాక్రే పార్టీ సీనియర్లు, జూనియర్లు అనే తేడా లేకుండా ప్రతి ఒక్కరితో సమావేశమయ్యారు. మస్యలుంటే పార్టీ అంతర్గత సమా వేశా ల్లోనే మాట్లాడాలని, చర్చించి పరిష్క రించుకోవాలని, లేదం టే పార్టీ పరంగా క్రమ శిక్షణ చర్యలు తప్పవని హెచ్చ రికలు చేయడంతో నాయకులు నోరెత్తడానికి ఆలోచిస్తున్నారు. దీంతో పార్టీ నాయకుల్లో కూడా కొంత మేర మార్పు వచ్చిం దనే టాక్ వినిపిస్తోంది. తెలంగాణ ఇచ్చిన పార్టీకి చెప్పుకుంటున్న ప్పటికి ఇప్పటికే రెండు పర్యాయాలు అధికారానికి దూరమైనా మనే భావనతో కాంగ్రెస్ నేతలు ఉన్నారు. ఎన్నికలకు మరో ఎని మిది నెలల సమయం ఉన్నం దు.. ప్రజలకు ఐక్యంగా ఉన్నా మనే సంకేతాలు ఇవ్వాలని లేదంటే .. పార్టీకి వచ్చే ఎన్నికల్లో తీరని నష్టం జరుగుతుందనే అంచనాకు వచ్చారని పార్టీ వర్గాలు చెబుతున్నాయి.
పాదయాత్రలతో క్షేత్ర స్థాయి క్యాడర్‌లో కదలిక !
కాంగ్రెస్ అగ్రనేత రాహుల్‌గాంధీ చేపట్టిన భారత్ జోడో యాత్రకు కొనసాగింపుగా అన్ని రాష్ట్రాల్లో హాత్ సే హాత్ జోడో అభియాన్ పేరుతో పాదయాత్రలు చేయాలని ఏఐసీసీ అదేశాలు ఇచ్చింది. ఈ పాదయాత్ర రేవంత్ రెడ్డి చేస్తారన్న విషయంపై వివాదం ప్రారంభమయింది. అయితే సీనియర్లందరికీ కొన్ని నియోజకవర్గాలు పంచిన థాక్రే.. పాదయాత్రలు చేయాలని సూచించారు. దీంతో తెలంగాణలో కూడా టీ పీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డి ఈ నెల 6 నుంచి పాదయాత్రను మొదలు పెట్టారు. య కులందరూ ఎవరికి వారుగా తమ, తమ నియోజక వర్గాల్లో పాదయాత్రలు చేయాలని, టీ పీసీసీ చీఫ్ రేవంత్‌రెడ్డి, సీఎల్పీ నేత భట్టి విక్రమమార్క, ఇతర సీనియర్లు రాష్ట్రంలో ఏదో ఒక చోట యాత్రల్లో పాల్గొనేలా రాజీ చేశారు. దీంతో సీనియర్లు పాదయాత్రలు ప్రారంభింంచారు.
రేవంత్ రెడ్డికి క్రమంగా పెరుగుతున్న సీనియర్ల మద్దతు !
టీ పీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డి హాత్ సే హాత్ జోడో అభియాన్ పేరుతో ఉమ్మడి వరంగల్ జిల్లాలోని ములుగు నుంచి పాదయాత్రకు శ్రీకారకం చుట్టి..రెండు నెలల పాటు జనంలో ఉండే విధంగా ప్లాన్ చేసుకుని ముందుకు సాగుతున్నారు. రేవంత్‌రెడ్డి పాదయాత్రకు సీఎల్పీ నేత భట్టి విక్రమార్క, పీసీసీ మాజీ అధ్యక్షుడు వి. హనుమంతరావు, మాజీ మంత్రి జానారెడ్డితో పాటు ఇతర సీనియర్లు కూడా హాజరై సంఘీభావం చెప్పారు. సీనియర్ నేతల్లో మార్పు రావడంతో పాటు పార్టీ కేడర్‌లో కూడా నూతన జోష్ వచ్చిందన్న అభిప్రాయం వినిపిస్తోంది. బీఆర్‌ఎస్, బీజేపీ ప్రభుత్వాల ప్రజా వ్యతిరేక నిర్ణయాలను ప్రజల ముం దు కు బలంగా తీసుకెళ్లితే తమకు అధికారం రావడం ఖాయమని.. ముందు పార్టీ గెలిస్తే..తర్వాత ప్రాధాన్యతలు.. పదవుల గురించి ఆలోచించవచ్చని అనుకుంటున్నారు. తెలంగాణ కాంగ్రెస్ నేతల్లో ఈ మార్పు ఆ పార్టీ క్యాడర్‌ను సంతృప్తి పరుస్తోంది.