AIADMK is keen to forge alliances with Vijay: తమిళనాట రాజకీయాల్లో అనూహ్య మార్పుల చోటు చేసుకుటున్నాయి. రెండేళ్ల తర్వాత జరగనున్న అసెంబ్లీ ఎన్నికల కోసం అన్ని పార్టీలు సమాయత్తమవుతున్నాయి. స్టాలిన్‌కు ధీటైన నాయకత్వం ఇతర పార్టీల్లో లేదని చర్చ జరుగుతున్న సమయంలో దళపతి విజయ్ తన తమిళగ వెట్రి కళగం పేరుతో తెర ముందుకు వచ్చేశారు. కొత్త పార్టీతో రాజకీయ రంగంలో అదృష్టాన్ని పరీక్షించుకుంటున్న విజయ్ అవసరమైతే పొత్తుల గురించి ఆలోచిస్తామన్నరు. ఒంటరిగా పోటీ చేయడానికి రెడీ అని కూడా ప్రకటించారు. అంటే విజయ్ రాజకీయ పరిస్థితుల్ని బట్టి పొత్తులపై నిర్ణయాలు తీసుకోవడనికి రెడీగా ఉన్నారని అనుకోవచ్చు.
అన్నాడీఎంకేను పల్లెత్తు మాట అనని విజయ్
తన పార్టీ మొదటి ప్లీనరీ మానాడును ఘనంగా నిర్వహించిన ఆయన తన ప్రసంగాల్లో ఎక్కడా అన్నాడీఎంకను పల్లెత్తు మాట అనడం లేదు. పూర్తిగా డీఎంకేను టార్గెట్ చేస్తున్నారు. వచ్చే ఎన్నికల్లో తాము ఒంటరిగా పోటీ చేస్తామని అంటున్నారు కానీ పొత్తుల గురించి కూడా ఆలోచిస్తానని చెబుతున్నారు. తమనేమీ విమర్శించకపోవడం.. పొత్తుల గురించి ఆశాజనకంగా మాట్లాడుతూండటంతో అన్నాడీఎంకే నేతల్లో ఆశలు పుడుతున్నాయి. అందుకే విజయ్‌తో పొత్తుల గురించి చర్చించాలని అనుకుంటున్నారు. ఇందు కోసం పళని స్వామి నేతృత్వంలోని అన్నాడీఎంకే ఇప్పటికే కొత్త ప్రయత్నాలు ప్రారంభిస్తున్నారు.
బీజేపీతో కటిప్ చెప్పిన అన్నాడీఎంకే - కొత్త పార్టనర్ కోసం ఎదురుచూపులు
అన్నాడీఎంకేకు ప్రస్తుతం నాయకత్వం లేక నిర్వీర్యమైపోతోంది. పన్నీర్ సెల్వం, పళనీ స్వామి మధ్య నలిగిపోయిన పార్టీ చివరికి పన్నీర్ సెల్వం బయటకు వెళ్లిపోయారు. బయటకు పంపేశారని అనుకోవచ్చు. ఇప్పుడు పళనీ స్వామి చేతల్లోనే పార్టీ ఉండిపోయింది. కానీ ఎదుగూ బొదుగూ లేదు. పార్లమెంట్ ఎన్నికల్లో ఒక్క సీటు రాలేదు.ఇప్పుడు విజయ్ పార్టీతో పోరాటం విజయ్ వర్సెస్ ఉదయనిధి అన్నట్లుగా మారుతుందని అంచనాలు రావడంతో అన్నాడీఎంకే ఎందుకైనా మంచిదని పొత్తులు సెట్ చేసుకుంటే బెటరని అనుకుంటోంది. గతంలో బీజేపీతో పొత్తులో ఉన్న ఆ పార్టీ పార్లమెంట్ ఎన్నికల నాటికే ఆ పార్టీతో కటీఫ్ చెప్పేసింది. పళనీ స్వామి మాస్ లీడర్ కాదు. జయలలిత వంటి మాస్ ఇమేజ్ ఉన్న లీడర్ నడిపిన పార్టీని పళనీస్వామి తన భుజాలపై మోయలేకపోతున్నారు. ఆ భారాన్ని పొత్తుల ద్వారా విజయ్ పై పెట్టవచ్చని ఆయన అనుకుంటున్నారు.
దేశ విభజన సమయంలో తప్పిపోయాడు - 77 ఏళ్ల తర్వాత కుటుంబం దగ్గరకు - చోటాసింగ్ లైఫ్ సినిమా స్టోరీనే
పరిస్థితుల్ని బట్టి విజయ్ నిర్ణయం
సరైన నాయకుడు లేకపోయినా అన్నాడీఎంకేకు మంచి క్యాడర్ ఉంది. గ్రామస్థాయి నుంచి భావజాలం ఉన్న కార్యకర్తలు ఉన్నారు. ఆ బలం విజయ్ పార్టీకి ప్లస్ అయ్యే అవకాశం ఉంది. సినిమా తారలకు క్రేజ్ ఉంటుంది కానీ.. ఓట్లు వేస్తారా అన్న సందేహం తమిళనాడులోనూ ఉంది. విజయ్ కాంత్ తో పాటు కమల్ హాసన్ కూడా విఫలమయ్యారు. అందుకే విజయ్ పార్టీ సభలకు వచ్చే జనాలను ఎవరూ లెక్కలోకి తీసుకోవడం లేదు. ఇది కూడా అన్నాడీఎంకేకు ప్లస్ పాయింట్ లా కనిపిస్తోంది. విజయ్ కూడా తన పార్టీ పై ప్రజల్లో వస్తున్న స్పందనను బట్టి..ఒంటరిగా వెళ్లాలా పొత్తులతో వెళ్లాలా అన్నది నిర్ణయం తీసుకోవచ్చు. విజయ్ పార్టీ ప్రత్యామ్నయంగా ఎదగలేకపోతే.. ఓట్ల చీలికతో డీఎంకే భారీగా లాభపడుతుంది. అందుకే చాయిస్ కోసం.. అన్నాడీఎంకేను విజయ్ విమర్శించడం లేదని అనుకోవచ్చు.