BJP LP leader Maheshwar Reddy: తెలంగాణ బీజేపీ ఎల్పీ లీడర్ మహేశ్వర్ రెడ్డి కాంగ్రెస్ పార్టీలో రేవంత్ రెడ్డికి ప్రాధాన్యత తగ్గిపోయిందని ప్రకటించారు. 2025 జూన్ లేదా డిసెంబర్ లో తెలంగాణకు కొత్త ముఖ్య మంత్రి వస్తారని జోస్యం చెప్పారు. ఉత్తమ్ కుమార్ రెడ్డి , బట్టి విక్రమార్క , కోమటి రెడ్డి వెంకట్ రెడ్డి , పొంగులేటి శ్రీనివాస్ రెడ్డిలలో ఎవరో ఒకరు ముఖ్య మంత్రి అవుతారని ప్రాబబుల్స్ కూడా ప్రకటించారు. ఇప్పటికే సీఎం రేవంత్ కు రాహుల్ గాంధీ అపాయింట్ మెంట్ ఇవ్వడం లేదని చెప్పుకొచ్చారు. రేవంత్ ఢిల్లీకి 7 సార్లు వెళ్లారు కానీ రేవంత్ రెడ్డి కి అపాయింట్మెంట్ ఇవ్వడం లేదన్నారు. రేవంత్.. కనీసం ప్రియాంక గాంధీని కలవాలని వయనాడ్ కు వెళ్లినా దర్శనభాగ్యం కలగలేదని మహేశ్వర్ రెడ్డి చెప్పుకొచ్చారు. అలాంటి పరిస్థితి ఉందా లేదా అన్నదానిపై ఇప్పుడు తెలంగాణలో చర్చ ప్రారంభమయింది.
చాప కింద నీరులా కాంగ్రెస్ అంతర్గత రాజకీయాలు
కాంగ్రెస్ పార్టీలో అంతర్గత రాజకీయాలు చాప కింద నీరులా విస్తరిస్తూ ఉంటాయి. ఈ క్రమంలో తెలంగాణలోనూ అలాంటి రాజకీయాలు ఉన్నాయి. రేవంత్ రెడ్డి కంటే దశాబ్దాలుగా తాము కాంగ్రెస్ పార్టీలో ఉన్నామని తామే సీనియర్లమని భావించేవారికి కొదవలేదు. సీఎం పదవికి తమ కంటే అర్హులు లేరని వాదించేవారికీ కొరత లేదు. అలాంటి వారు హైకమాండ్ వద్ద పలుకుబడి పెంచుకునేందుకు ఎవరి ప్రయత్నాలు వారు చేసుకుంటూ ఉంటారు. అదంతా బహిరంగమే. అయితే పార్టీకి వ్యతిరేకంగా వారెప్పుడూ మాట్లాడే ప్రయత్నం చేయలేదు. కానీ తమ రాజకీయ వ్యూహాలను మాత్రం అమలు చేస్తూనే ఉన్నారు. మహేశ్వర్ రెడ్డి చెప్పిన ఐదుగురు నేతలే కాదు మరికొంత మంది కూడా తాము సీఎం పదవికి అర్హులమేనని అంటూ ఉంటారు.
పాదయాత్ర చేస్తానన్న కేటీఆర్..గులాబీ పార్టీ కొత్త అధినేతగా అడుగులు
ప్రియాంక గాంధీ నామినేషన్ కార్యక్రమంలోపాల్గొన్న రేవంత్
మహేశ్వర్ రెడ్డి ఏ ఉద్దేశంతో కాంగ్రెస్ సీఎం మార్పు గురించి ప్రకటన చేశారో కానీ ఆయన చెప్పిన విషయాల్లో చాలా అసత్యాలు ఉన్నాయని కాంగ్రెస్ నేతలు చెబుతున్నారు. రేవంత్ రెడ్డికి రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీ అపాయింట్‌మెంట్లు ఇవ్వకపోవడం అనేది లేదని ఏడు నెలల కాలంలో రేవంత్ రెడ్డి చాలా సార్లు వారిని కలిశారనిగుర్తు చేస్తున్నారు. ప్రియాంకాగాంధీ నామినేషన్ కు స్వయంగా వాయనాడ్ వెళ్లిన రేవంత్ రెడ్డి ఆమెకు కాంగ్రెస్ కండువా కప్పారు. ఆ దృశ్యాలు కూడా వైరల్ అయ్యాయి. ఆ నామినేషన్ కార్యక్రమంలో ప్రముఖంగా పాల్గొన్నారు. జాతీయ పార్టీలో రేవంత్ రెడ్డి ఇప్పుడు ప్రముఖ నేతగా ఉన్నారు. బీజేపీకి కౌంటర్ ఇచ్చే విషయంలో ఆయన వ్యూహాత్మకంగా ఉంటున్నారు.
తెలంగాణలో మందుబాబులకు బిగ్ షాక్! త్వరలో మద్యం ధరల పెంపు
వచ్చే జూన్, డిసెంబర్ అని చెప్పడంలోనే ఎత్తుగడ ఉందా?
సీఎంను మార్చాలని అనుకుంటే హైకమాండ్ .. నెలల తరబడి అవకాశం తీసుకోదు. అనుకున్నది వెంటనే మార్చేస్తుంది. మహేశ్వర్ రెడ్డితో హైకమాండ్ సంప్రదించినట్లుగా వచ్చే జూన్ లేదా డిసెంబర్ అంటూ ముహుర్తం చెప్పారు. ఇక్కడే ఆయన కాంగ్రెస్ పార్టీలోని కొంత మంది నేతల వ్యూహం ప్రకారం మాట్లాడుతున్నారని కొంత మందికి డౌట్ వస్తుంది. మహేశ్వర్ రెడ్డి స్వతహాగా కాంగ్రెస్ నేత. గత ఎన్నికలకు ముందు ఆయన బీజేపీలో చేరి టిక్కెట్ తెచ్చుకుని గెలిచారు. ఆయనకు చాలా చాలా కాంగ్రెస్ నేతలతో సన్నిహిత సంబంధాలు ఉన్నాయి. కానీ రేవంత్ తో లేవు. అక్కడే ఆయన కాంగ్రెస్ అంతర్గత రాజకీయాల్లో జోక్యానికి అవకాశం ఏర్పడిందని భావిస్తున్నారు.