Achenna TDP :    ప్రభుత్వం తీతిలి బాధితులకు ఇస్తామన్న అదనపు సాయం అందరికీ ఇవ్వకుండా మోసం చేస్తున్నారని టీడీపీ ఏపీ అధ్యక్షుడు అచ్చెన్నాయుడు విమర్సించారు.  
రాష్ట్ర ప్రభుత్వం రైతాంగానికి మోసం చేస్తుందని అయినా సిగ్గు లేకుండా.. రైతు దినోత్సవం నిర్వహిస్తున్నారని విమర్శించారు. రైతు దినోత్సవం కంటే రైతు దగా దినోత్సవం అని పెడితే బాగుంటుందన్నారు. 2018 లో తితిలీ తుఫాన్  శ్రీకాకుళం జిల్లా లో విధ్వంసం సృష్టించిందని ఆ సమయంలో  యుద్ద ప్రాతిపదికన  పరిహారం ఇచ్చామన్నారు.  పక్క జిల్లాలో క్యాట్ వాక్  చేస్తూ జగన్ కనీసం సిక్కోలు ప్రజలకు పరామర్శ కూడా చేయలేదు కానీ.. ఎన్నికల ప్రచారంలో రెట్టింపు పరిహారం ఇస్తామని హామీ ఇచ్చారు.


వైఎస్ఆర్‌ సీపీ గౌరవాధ్యక్షురాలిగా వైఎస్ విజయమ్మ రాజీనామా, ప్లీనరీలో సంచలన ప్రకటన


ఇప్పుడు నష్టపరిహారం  లక్షా 6 వేల మందికి బదులు 90 వేల మందికి పరిహారం ఇస్తున్నారుని.. అధికారులు సర్వే చేసి.. టిడిపి సానుబూతిపరుల పేర్లు తీయడం దారుణమన్నారు.  ముఖ్యమంత్రి.. అందరికి సంక్షేమం అదిస్తామంటూ ప్రకటనల చేస్తూ 16 వేల మంది రైతులను తీసి వేశారని.. డబుల్ పరిహారం కూడా లేదు.. తప్పుడు హామీతో  ప్రజలను మోసం చేశారని ఆరోపించారు. పరిహారం లిస్ట్ లు ఎందుకు బైట పెట్టడం లేదని ప్రశ్నించారు. న్యాయం కోసం కోర్టుకు వెళ్తామని.. పరిహారం కోసం పోరాడుతామన్నారు..


గజదొంగలంతా ఏకమైనా మనల్ని అధికారంలోకి రాకుండా అడ్డుకోలేరు: వైఎస్ జగన్ ధ్వజం


 రైతు లకు ఏం చేసారని రైతు దినోత్సవం జరుపుతున్నారని ప్రశ్నించారు. అడిగిన విత్తనాలు ఏ రైతు బరోసా కేంద్రంలో  దోరకడంలేదని గుర్తు చేశారు.  క్రాప్ హాలిడే ప్రకటన తరువాత కూడా రైతు దినోత్సవం ఏంటిని ప్రశ్నించారు. ఏపి లో వేల మంది రైతులు ఆత్మహత్యలు చేసుకున్నారని కేంద్ర రిపోర్ట్ లే చెపుతున్నాయని .. ప్రభుత్వంపై మండిపడ్డారు.   రైతులకు 14500 ఇస్తామని ప్రకటించారు.. ఇప్పుడు 7500 మాత్రమే ఇస్తున్నారు ...పండిన పంటలు అమ్ముకున్నా .. డబ్బులు చెల్లించడం లేదని విమర్శించారు.


రాహుల్‌ని ప్రధాని చెయ్యాలనేది వైఎస్ కోరిక, అలా జరిగితేనే ఆత్మకు శాంతి: రేవంత్ రెడ్డి


రైతు సమస్యలపై కలెక్టర్‌కు వినతి పత్రం ఇచ్చేందుకు వెళ్లిన అచ్చెన్నాయుుడును పోలీసులు అడ్డుకున్నారు. అయితే గేటు వద్ద ఉద్రిక్తతఏర్పడింది. తర్వాత కొద్ది మందిని మాత్రమే కలెక్టరేట్‌లోకి అనుమతించారు.  కలెక్టర్ అపాయింట్మెంట్ ఇస్తే పోలీసులు అడ్డు కుంటున్నారని.. మేం ఉగ్రవాదులు మా అని ప్రశ్నించారు.  మేం మహానాడు చేస్తే.. మంత్రులు బస్సు యాత్ర చేశారని.. నేడు వైసిపి ప్లీనరీ జరుగుతుంది... ఈ రోజు ఏలా వారికి ప్లేస్ ఇచ్చారని ప్రశ్నించారు.  నాగార్జున యూనివర్సిటీ కి సెలవులు సైతం ఇచ్చారని..  వైసిపి ప్లీనరీ కాదు.. వైసిపి ప్రభుత్వ ప్లీనరీ అని మండిపడ్డారు.   ఇంటింటికి వెల్లి బెదిరించి మరీ ప్లీనరీ కి తీసుకెళ్తున్నారని..  వైసిపి ప్లీనరీ అధికార దుర్వినియోగానికి పరాకాష్ఠ అని విమర్శించారు.