Central Team To Telangana :  వరద నష్టం అంచనాలకు కేంద్ర బృందం తెలంగాణకు రానుంది. తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్ కుమార్, రాష్ట్ర వ్యవహారాల ఇంఛార్జ్ తరుణ్ చుగ్ కేంద్ర హోంమంత్రి అమిత్ షాను కలిసి పరిస్థితి వివరించారు. తెలంగాణలో వరదల వల్ల సంభవించిన నష్టాన్ని, ప్రజలు ఎదుర్కొంటున్న ఇబ్బందులను అమిత్ షాకు వివరించారు.  వెంటనే స్పందించిన కేంద్ర హోంమంత్రి అమిత్ షా... హోంశాఖ ఆధ్వర్యంలోని ఉన్నత స్థాయి బృందాన్ని  తక్షణమే తెలంగాణకు పంపాలని  నిర్ణయించారు. హైపవర్ కమిటీ అంచనా వేసి కేంద్రానికి నివేదిక ఇవ్వనుంది. 






వరద సాయంపై టీఆర్ఎస్ బీజేపీ మధ్య పరస్పర విమర్శలు


వరదల సహాయ చర్యల విషయంలో బీజేపీ, టీఆర్ఎస్ మధ్య రాజకీయ వివాదం ప్రారంభమయింది.  బాధితుల్ని ఆదుకోవడం లేదని రాష్ట్ర ప్రభుత్వంపై బీజేపీ నేతలు విమర్శలు గుప్పిస్తున్నారు. అయితే ఇంత భారీగా వరదలు వచ్చినా కేంద్రం కనీసం ఒక్క సారి కూడా పట్టించుకోలేదని  కొన్ని లక్షల మంది ఇబ్బంది పడుతున్నా .. కేంద్ర ప్రభుత్వం కనీస సాయం చేయలేదన్న విమర్శలు టీఆర్ఎస్ వైపు నుంచి వస్తున్నాయి. తెలంగాణపై మీకున్న చిత్తశుద్ధి అదేనా అని అధికార పార్టీ నేతలు ప్రశ్నిస్తున్నారు. 


పోలవరం కేంద్రంగా మళ్లీ విభజన సెంటిమెంట్ పాలిటిక్స్ - వర్కవుట్ అవుతుందా ?


ఢిల్లీలో  అమిత్ షాను కలిసి వరద  బాధితుల కష్టాలు వివరించిన బండి సంజయ్ , తరుణ్ చుగ్ 


వరద నష్టం అంచనాలను పంపకుండా కేంద్రం ఎలా సాయం చేస్తుందని బీజేపీ నేతలు ప్రశ్నిస్తున్నారు. వరద నష్టం అంచనాలు కూడా తయారు చేయడం రాదని విమర్శిస్తున్నారు. అయితే వరద బాధితులకు సరైన సాయం చేయకుండా వీరు రాజకీయం ప్రారంభించడంతో బాధితుల నుంచి విమర్శలు వస్తున్నాయి. ఈ విషయంలో టీఆర్ఎస్ విమర్శలను తిప్పికొట్టేందుకు బీజేపీ నేతలు హుటాహుటిన ఢిల్లీ వెళ్లి కేంద్రమంత్రికి తమ విజ్ఞప్తిని తెలిపారు. అమిత్ షా కూడా టీమ్‌ను పంపడానికి అంగీకరించారు. 


అది క్లౌడ్ బరస్ట్ కాదు మామూలు వర్షమే - తమిళిసై కీలక వ్యాఖ్యలు !


వరద నష్టాన్ని కేంద్ర హోంశాఖ అంచనా వేస్తుందా ? 


అయితే వరద నష్టం అంచనాకు హోంశాఖ నుంచి బృందాలు ఎందుకు వస్తాయన్న సందేహం టీఆర్ఎస్ నేతలు వ్యక్తం చేస్తున్నారు. సహాయ కార్యక్రమాలకు సాయం కోసం బృందాలను పంపమంటే హోంశాఖ  పంపుతుందని కానీ వరద నష్టం అంచనా వేసేది హోంశాఖ కాదని చెబుతున్నారు. ముందు ముందు ఈ అంశంపై రాజకీయం చోటు చేసుకునే అవకాశం ఉంది.