From Hut to Hope: గుడిసె నుండి కొత్త భవనానికి - ఎలిశెట్టిపల్లె విద్యార్థుల్లో చిగురించిన ఆశలు
ఒకప్పుడు తాటి పలుచటి దిమ్మెల్లో, గాలికట్టిన గుడిసెల్లో చదువుకోవడం లాగ ఉండేది ఏటూరునాగారం మండలం ఎలిశెట్టిపల్లె విద్యార్థుల దుస్థితి. వర్షం పడినా, ఎండకు తాళలేకపోయినా, తల్లిదండ్రుల ఆశలతో పిల్లలు స్కూల్‌కు వచ్చేవారు. ఆనాటి పరిస్థితులు చూస్తే ప్రతి మనసూ కలతకు గురవుతుందనడానికి ఈ ఫొటో నిదర్శనం.
తెలంగాణ కాంగ్రెస్ ప్రభుత్వం ఈ చిత్రాన్ని మార్చింది. అడవుల్లో తిరిగిన మహిళ, గిరిజనుల పక్షపాతి అయిన తెలంగాణ మంత్రి సీతక్క పూరిగుడిసె కింద విద్యాభ్యాసం చేస్తున్న చిన్నారుల కష్టాల్ని గమనించి, వారి సమస్యల్ని అర్ధం చేసుకుని పరిష్కారం చూపించారు. ఏటూరునాగారం మండలం ఎలిశెట్టిపల్లె పాఠశాల కోసం 15 లక్షల నిధులతో నూతన భవనాన్ని నిర్మించారు.
ఎలిశెట్టిపల్లె స్కూల్ కొత్త భవనంతో ఒక్క పాఠశాలకు మాత్రమే కాదు, ఒక తరం జీవితానికి బలమైన పునాది పడిందని చెప్పవచ్చు. కలెక్టర్ సహకారంతో, ఇప్పుడు ఆ పిల్లలు గౌరవంగా కూర్చొని స్కూల్లో చదువుతున్నారు.
మంచి సదుపాయాలతో కూడిన స్కూల్ బిల్డింగ్ పిల్లల భవిష్యత్తుకి ఆశాకిరణంగా మారింది. పూరిగుడిసెల నుండి ప్రతిభావంతుల దిశగా ప్రయాణం మొదలైంది అన్నారు మంత్రి సీతక్క. ఇదే ప్రజా పాలనకు నిదర్శనమని, ఇదే కాంగ్రెస్ ప్రభుత్వానికి ప్రతీక అన్నారు.