Viral News: కోడి పుంజు చెవులకు కమ్మలు, మెడలో హారం- వైవిధ్యంగా మొక్కులు తీసుకున్న వరంగల్ వాసి
Sheershika | 12 Aug 2024 11:48 AM (IST)
1
తెలంగాణ ప్రాంతంలో ఇప్పుడు బోనాల సీజన్ కొనసాగుతుంది. గ్రామదేవతలకు అంగరంగా వైభవంగా బోనాలు చేసి కోళ్లు మేకలను బలిస్తారు.
2
మహబూబాబాద్‌లో వింత చోటు చేసుకుంది. కేశముంద్రం మండల కేంద్రంలో ప్రజలు బోనాలు చేశారు. వెంకన్న భక్తుడు అమ్మవారికి కోడిని బలివ్వడానికి బయలు దేరాడు.
3
కోడి పుంజును అందంగా ముస్తాబు చేశాడు. చెవులకు పొడవాటి కమ్మలు, మెడలో అభరణాలతో అలంకరించి బోనాలతో గ్రామ దేవత వద్దకు బయల్దేరాడు.
4
కోడి పుంజును ఆభరణాలతోపాటు మెడలో మద్యం బాటిల్ కూడా వేలాడదీశారు.
5
కోడి పుంజును అభారణాలతో అందంగా ముస్తాబు చేయడంతో బోనాలతో తరలివచ్చిన మహిళలు, గ్రామస్తులు ఆశ్చర్యానికి గురయ్యారు. అంతరం కోడిపుంజు అమ్మవారికి బలిచ్చారు.