Paris Olympics 2024 Closing Ceremony: విశ్వక్రీడలకు తెర, ఇదొక సంబరాల జాతర
పారిస్ ఒలింపిక్స్ 2024 చివరి పతకం దక్కించుకున్న సిఫాన్ హసన్. విశ్వ క్రీడల్లో చివరి పసిడి పతకాన్ని సిఫాల్ దక్కించుకుని రికార్డు సృష్టించుకుంది.
2024 విశ్వ క్రీడలు సజావుగా సాగేందుకు 45,000 మంది వాలంటీర్లు పాల్గొన్నారు. ముగింపు వేడుకల్లో వీరి సేవలను కొనియాడారు.
1896లో ఏథెన్స్ ఒలింపిక్స్ ప్రారంభమయ్యాయి. దీనికి గుర్తుగా పియరీ డి కూబెర్టిన్‌కు నివాళులు అర్పించారు.
ఒలింపిక్స్ ముగింపు వేడుకల్లో లైట్‌షో ఆకట్టుకుంది. బాణాసంచ వెలుగుల్లో స్టేడ్ డి ఫ్రాన్స్ స్టేడియం వెలిగిపోయింది.
ముగింపు వేడుకల్లో మ్యూజికల్ బ్యాండ్ 'ఫీనిక్స్' ప్రదర్శన మంత్రుముగ్దులను చేసింది.
దిగ్గజ అథ్లెట్లు ఈ ముగింపు సంబరాల్లో పాల్గొని సందడి చేశారు. పలువురికి నివాళులు అర్పించారు.
ఈ పారిస్ ఒలింపిక్స్ ముగింపు వేడుకల్లో హాలీవుడ్ నటుడు టామ్ క్రూజ్ ప్రత్యేక ఆకర్షణగా నిలిచాడు. ఒలింపిక్స్ జెండాను తనతో తీసుకెళ్లి ఏంజిల్స్ 2028 విశ్వ క్రీడలకు అంకురార్పణ చేశాడు.
లాస్ ఏంజెల్స్ ఒలింపిక్స్ నిర్వహణకు సిద్ధమైంది. బిల్లీ ఎలిష్ ప్రదర్శన ఆకట్టుకుంది
2028 ఒలింపిక్స్‌కు US ఆతిథ్యం ఇవ్వడానికి సిద్ధమైంది. దీనికి నిదర్శనంగా స్నూప్ డాగ్, డాక్టర్ డ్రే ద్వయం ఇచ్చిన ప్రదర్శన ఆకట్టుకుంది.
ఫ్రెంచ్ గాయని యసెల్ట్ ప్రదర్శన సైతం ఆకట్టుకుంది.