Revanth Reddy: నా జీవితంలో ఈరోజు చరిత్రాత్మకం - సీఎం రేవంత్ రెడ్డి ఆసక్తికర వ్యాఖ్యలు
తన జీవితంలో ఈరోజు (జూన్ 21వ తేదీ) చారిత్రాత్మకమైన రోజు అని తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.
Download ABP Live App and Watch All Latest Videos
View In App6 మే 2022 నాడు వరంగల్ వేదికగా రాహుల్ గాంధీ లక్షలాది మంది తెలంగాణ రైతులకు ఏకకాలంలో రూ.2 లక్షల రుణమాఫీ అని వరంగల్ డిక్లరేషన్ ఇచ్చారని రేవంత్ రెడ్డి తెలిపారు.
నా సారథ్యంలో తెలంగాణ మంత్రివర్గం రైతుల రుణమాఫీపై ఇచ్చిన మాటను నిలబెట్టుకుందని రేవంత్ రెడ్డి పేర్కొన్నారు. మాట ఇచ్చినట్లుగా తెలంగాణ రైతులకు ఒకే దఫాలో రూ.2 లక్షల వరకు రుణమాఫీ చేయాలని రాష్ట్ర కేబినెట్ నిర్ణయం తీసుకుందని ట్వీట్ చేశారు.
తెలంగాణలో రెండు పర్యాయాలు అధికారంలోకి వచ్చిన బీఆర్ఎస్ కేసీఆర్ ప్రభుత్వం దాదాపు 10 ఏళ్లలో రూ.28 వేల కోట్లు రుణమాఫీ చేసిందన్నారు. అది కూడా వడ్డీలు పెరిగి అన్నదాతలు ఇబ్బంది పడితే రుణమాఫీ జరిగిందన్నారు.
కాంగ్రెస్ ప్రభుత్వంలో 12 డిసెంబర్ 2018 నుంచి 9 డిసెంబర్ 2023 వరకు గరిష్టంగా రూ.2 లక్షల వరకు తీసుకున్న రైతుల రుణాలను మాఫీ చేస్తున్నామని సీఎం రేవంత్ రెడ్డి ప్రకటించారు. త్వరలోనే దీనిపై విధివిధానాలు రూపొందించి ప్రకటన చేస్తామన్నారు.