Warangal: విజయ గర్జన సభ కోసం రంగంలోకి దిగిన మంత్రులు, టీఆర్ఎస్ కీలక నేతలు
టీఆర్ఎస్ పార్టీ ఆవిర్భవించి 2 దశాబ్ధాలు పూర్తి చేసుకుంటున్న సందర్భంగా నవంబర్ 15న వరంగల్ లో విజయ గర్జన సభ నిర్వహించాలని పార్టీ అధిష్టానం నిర్ణయించింది.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appసుమారు 10లక్షల మందితో భారీ ఎత్తున సభను నిర్వహించి, విజయవంతం చేసేందుకు టీఆర్ఎస్ నేతలు రంగంలోకి దిగారు. అందులో భాగంగా వరంగల్ నగరంలోని మడికొండ, ఉనికిచర్ల, రాంపూర్ శివార్లలోని ఖాళీ స్థలాలను తెలంగాణ మంత్రులు ఎర్రబెల్లి దయాకర్రావు, సత్యవతి రాథోడ్ పరిశీలించారు.
సీఎం కేసీఆర్ అభీష్టం మేరకు భారీ ఎత్తున పార్టీ శ్రేణులను, మద్దతుదారులను వచ్చేలా చేసి సభను విజయవంతం చేయడానికి అన్ని హంగులతో సభ నిర్వహించేందుకు అనువైన స్థలాలను పరిశీలిస్తున్నారు.
టీఆర్ఎస్ పార్టీ స్థాపించి 20 ఏళ్లు పూర్తయిన సందర్భంగా ఇటీవల హైదరాబాద్ లోని హైటెక్స్ లో టీఆర్ఎస్ ప్లీనరీని ఘనంగా నిర్వహించారు. ఈ నెలలో తమకు సెంటిమెంట్ అయిన వరంగల్ లో భారీ సభను నిర్వహించాలని సీఎం కేసీఆర్ నిర్ణయించారు.
20 ఏళ్ల తమ ప్రస్థానంతో పాటు గత ఏడేళ్లలో తెలంగాణ ప్రభుత్వం సాధించిన ప్రగతిని సీఎం కేసిఆర్ తమ పార్టీ శ్రేణులకు, ప్రజలకు నివేదిస్తారని మంత్రి ఎర్రబెల్లి దయాకర్రావు తెలిపారు. ప్రభుత్వ చీఫ్ విప్ వినయ్ భాస్కర్, ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షుడు బి.వినోద్ కుమార్, మాజీ డిప్యూటీ సీఎం కడియం శ్రీహరి, మాజీ స్పీకర్ మధుసూదనాచారి తదితరులు సభా స్థలాన్ని పరీశీలించిన వారిలో ఉన్నారు.