TS Lok Sabha Election 2024: ఓటు హక్కు వినియోగించుకున్న సీఎం రేవంత్, కేసీఆర్, అసదుద్దీన్ తదితర ప్రముఖులు
హైదరాబాద్ బిజెపి ఎంపీ అభ్యర్థి మాధవి లత మహేంద్ర హిల్స్ లో ఓటు హక్కు వినియోగించుకున్నారు.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appకేంద్రమంత్రి కిషన్ రెడ్డి కుటుంబ సభ్యులతో కలిసి ఓటు హక్కు వినియోగించుకున్నారు. కాచిగూడ డివిజన్ దీక్ష మోడల్ స్కూల్ లో ఓటు వేశారు.
పార్లమెంట్ ఎన్నికల్లో భాగంగా స్వగ్రామం వేల్పూర్ లో ఓటు హక్కు వినియోగించుకున్న మాజీ మంత్రి ఎమ్మెల్యే వేముల ప్రశాంత్ రెడ్డి
తెలంగాణ శాసన మండలి చైర్మన్ గుత్తా సుఖెందర్ రెడ్డి నల్గొండ పట్టణంలో కుటుంబ సమెతంగా తన ఓటు హక్కును వినియోగించుకున్నారు. నాగార్జున కాలనీలోని ఎమ్. వి . ఆర్ హై స్కూల్ లో గుత్తా సుఖెందర్ రెడ్డి, ఆయన సతీమణి గుత్తా అరుంధతి ,తనయుడు గుత్తా అమిత్ రెడ్డి ఓటు హక్కును వినియోగించుకున్నారు
సిద్దిపేట జిల్లాలోని తమ స్వగ్రామం చింతమడకలో ఓటు హక్కు వినియోగించుకున్నారు బీఆర్ఎస్ అధినేత, మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ దంపతులు.
బంజారాహిల్స్ లోని నంది నగర్ జీహెచ్ఎంసి కమ్యూనిటీ హాల్ లో సతీమణి, కుమారుడు హిమాన్షు రావుతో కలిసి తన ఓటు హక్కును వినియోగించుకున్న మాజీ మంత్రి కేటీఆర్
అలంపూర్ లో ఓటు హక్కును వినియోగించుకున్న నాగర్ కర్నూల్ బీఆర్ఎస్ అభ్యర్థి ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్.. గ్రామాల్లో ఓట్ల పండగ వాతావరణం కనిపిస్తోందని, ఉదయాన్నే పోలింగ్ కేంద్రాలకు పెద్ద ఎత్తున ఓటర్లు తరలివస్తున్నారని చెప్పారు.
సిద్దిపేట ఎమ్మెల్యే, మాజీ మంత్రి హరీష్ రావు తన కుటుంబసభ్యులతో కలిసి సిద్దిపేటలో ఓటు వేశారు.
టిపిసిసి అధ్యక్షులు, తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తన కుటుంబ సభ్యులతో కలిసి ఓటు హక్కును వినియోగించుకున్నారు. కొడంగల్‌లోని జిల్లా పరిషత్ బాలుర ఉన్నత పాఠశాలలో సీఎం ఫ్యామిలీ ఓటేసింది.
లోక్ సభ ఎన్నికల సందర్భంగా కుటుంబ సభ్యులతో కలిసి ఖమ్మం జిల్లా మధిరలో ఓటు హక్కును వినియోగించుకున్న ఉపముఖ్యమంత్రి భట్టి విక్రమార్క.
స్టేషన్ ఘన్ పూర్ ఎమ్మెల్యే కడియం శ్రీహరి, వరంగల్ పార్లమెంట్ కాంగ్రెస్ పార్టీ ఎంపీ అభ్యర్థి కడియం కావ్య తమ కుటుంబ సభ్యులతో కలిసి ఓటు హక్కును వినియోగించుకున్నారు
కుటుంబ సభ్యులతో కలిసి ఓటు హక్కును వినియోగించుకున్న మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి
లోక్ సభ ఎన్నికల పోలింగ్ సందర్భంగా ములుగు జిల్లా జగ్గన్నపేటలో ఓటు హక్కును వినియోగించుకున్నారు మంత్రి సీతక్క.
ఎంఐఎం అధినేత, హైదరాబాద్ సిట్టింగ్ ఎంపీ అసదుద్దీన్ ఒవైసీ కుటుంబ సభ్యులతో కలసి వచ్చి తన ఓటు హక్కును వినియోగించుకున్నారు