జహంగీర్‌పీర్ దర్గాలో ఘనంగా గంధోత్సవం
రంగారెడ్డి జిల్లా షాద్ నగర్ నియోజకవర్గం కొత్తూరు మండలప రిధిలోని ఇన్ముల్‌నర్వ గ్రామ శివారులోని హజ్రత్ జహంగీర్‌పీర్ (జేపీ) దర్గా ఉర్సు ఉత్సవాలు ఘనంగా ప్రారంభమయ్యాయి.
గురువారం గంధోత్సవ కార్యక్రమం అత్యంత భక్తి శ్రద్ధలతో నిర్వ హించారు. రాష్ట్ర వక్ఫ్‌బోర్డు అధికారులు ఫరూక్ ఆరిఫ్, స్థానిక తహశీల్దార్ తదితర స్థానిక గ్రామ స్థాయి అధికారులతో పాటు పలువురు గంధాన్ని తలపై పెట్టుకుని ఊరేగింపుగా వెళ్లి దర్గాలో సమర్పించారు.
అంతకుముందు దర్గా ఆవరణలోని మజీద్‌లో పలువురు ముస్లిం పెద్దలు ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించారు.
ముజావర్లు వారికి ఆశీర్వచనాలు ఇచ్చి గంధంతోపాటు ప్రసాదాలు అందజేశారు.
ఈ ఉత్సవాలకు భక్తులు అధిక సంఖ్యలో తరలి వచ్చి దర్గాను దర్శించుకుని మొక్కులు తీర్చుకున్నారు.
ఏసీపీ కుషాల్కర్ ఆధ్వర్యంలో ఇన్‌స్పెక్టర్లు భూపాల్‌శ్రీధర్ తదితర సిబ్బంది దర్గా వద్ద భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు.