In Pics: యాదాద్రిలో కిషన్ రెడ్డి.. స్వామివారి దర్శనం, ఆలయ పునర్నిర్మాణం పరిశీలన
రెండు రోజులుగా జన ఆశీర్వాద యాత్రలో పాల్గొంటున్న కేంద్రమంత్రి కిషన్‌రెడ్డి శనివారం ఉదయం యాదాద్రి శ్రీ లక్ష్మీ నరసింహస్వామిని దర్శించుకున్నారు.
ఈ సందర్భంగా స్వామి వారికి కేంద్రమంత్రి పూజలు చేశారు. ఆలయానికి వచ్చిన కిషన్ రెడ్డికి అర్చకులు పూర్ణకుంభ స్వాగతం పలికారు.
స్వామివారి చిత్రపటాన్ని ఆలయ అధికారులు కిషన్ రెడ్డికి అందజేశారు. దర్శనం తర్వాత కొండపైన పునర్నిర్మాణం అవుతున్న ప్రధాన ఆలయాన్ని కిషన్ రెడ్డి పరిశీలించారు.
అనంతరం భువనగిరిలో కిషన్ రెడ్డి జన ఆశీర్వాద యాత్రలో కిషన్ రెడ్డి మూడో రోజు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ‘‘తెలంగాణ ప్రజలు మార్పును కోరుకుంటున్నారు. ఈటల రాజేందర్‌ను హుజూరాబాద్‌లో ఓడించడమే టీఆర్ఎస్ అజెండాగా పెట్టుకుంది.’’ అని అన్నారు.
‘‘కేసీఆర్‌తో పాటు మంత్రులంతా హుజూరాబాద్‌లోనే ఉంటున్నారు. వారి వ్యూహాలు తిప్పికొట్టాలి. హుజూరాబాద్‌లో ఈటల రాజేందర్‌ను గెలిపించాలి.’’ అని కిషన్ రెడ్డి అన్నారు.
దేశంలో పర్యటక రంగాన్ని పెంచాల్సిన అవసరం కూడా ఉందని కిషన్ రెడ్డి అన్నారు.
బతుకమ్మ, గిరిజన పండగలు, సమ్మక్క-సారక్క జాతరలను వచ్చే రెండేళ్లలో టూరిజం స్పాట్‌లుగా చేయనున్నట్లు కిషన్ రెడ్డి పేర్కొన్నారు.
రాష్ట్ర ప్రభుత్వంతో చర్చించి భువనగిరి కోటను కూడా అభివృద్ధి చేస్తామని చెప్పారు.