Miss World 2025: నల్గొండ జిల్లా బుద్ధ భవన్‌లో 'సాగర్' కన్యల హెరిటేజ్ వాక్
బుద్ధవనాన్ని సందర్శించిన మిస్ వరల్డ్ 2025పోటీలకు వచ్చిన సుందరీమణులు
బుద్ధవనం మహాస్థూపం వద్ద ఫోటోలు దిగిన 22 ఆసియా దేశాల పోటీదారుల బృందం
బుద్ధుని మహా పాదాలకు పూలతో పూజలు చేసిన అందగత్తెలు
మహా స్థూపంలో జ్యోతిని వెలిగించి ధ్యానంలో పాల్గొన్న బ్యూటీస్
నాగార్జున సాగర్ తీరం అందాలను ఆస్వాదించిన మిస్ వరల్డ్ 2025 కంటెనండర్స్
ప్రపంచ సుందరీమణుల పోటీదారులకు ఘనంగా స్వాగతం పలికిన జిల్లా కలెక్టర్ ఇలా త్రిపాఠి.ఎస్ పి శరత్ చంద్ర పవార్
image 7ఈ టూర్‌లో పాల్గొన్న స్థానిక ఎంఎల్ఏలు కుందూరు జయవీర్ రెడ్డి, బాలు నాయక్, బత్తుల లక్మారెడ్డి, ఎం ఎల్ సి శంకర్ నాయక్
తెలంగాణ రాజధాని హైద్రాబాద్ లో నిర్వహిస్తున్న మిస్ వరల్డ్ పోటీల్లో ప్రపంచ వ్యాప్తంగా అందగత్తెలు పాల్గొంటున్నారు.
సోమవారం జరిగిన టూర్‌లో కేవలం ఆసియా దేశాలకు చెందిన 22 మంది కంటెస్టెంట్స్ మాత్రమే పాల్గొన్నారు.
అతిథులకు నల్గొండ జిల్లా యంత్రాంగం ఘనంగా ఆతిథ్యమిచ్చింది.
ముందుగా సుందరీమణుల బృందం నాగార్జున సాగర్ తీరాన ఉన్న విజయ విహార్ లో ఫోటోలు దిగారు.
అనంతరం బుద్ధవనాన్ని సందర్శించారు.
మహాస్థూపం వద్ద ప్రపంచ సుందరీమణులకు లంబాడా కళాకారులు లంబాడా నృత్యంతో ఘన స్వాగతం పలికారు.
బుద్ధవనం ప్రాముఖ్యత, బుద్ధుడి జననం నుంచి నిర్యాణం వరకు జరిగిన ఘటనలు ఆర్కియాలజిస్ట్ శివనాగిరెడ్డి వివరించారు.
జాతకవనంలో బుద్ధ చరితంపై కళాకారులు నృత్య ప్రదర్శన ఇచ్చారు.
ప్రజాప్రతినిధులు వారితో మాట్లాడుతూ బుద్ధవనం ,నాగార్జున సాగర్ ప్రాముఖ్యతను తెలంగాణ గొప్పతనాన్ని వివరించారు.
మూడు రోజుల క్రితం హైదరాబాద్‌లో ఈ మిస్ వరల్డ్ పోటీలు ఘనంగా ప్రారంభమయ్యాయి.