ORR Lighting Photos: ఓఆర్ఆర్ జిల్ జిల్ జిగేల్.. ఔటర్ రింగు రోడ్డుపై ఎల్ఈడీ వెలుగులు
ఔటర్ రింగ్ రోడ్డుకు ఎల్ఈడీ కాంతులు తీసుకొచ్చింది తెలంగాణ ప్రభుత్వం. రోడ్డు ప్రమాదాల నివారణకు136 కిలోమీటర్ల మేర లైటింగ్ ఏర్పాటు చేశారు.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appరూ. 100 కోట్లతో ఓఆర్ఆర్ విద్యుద్దీకరణ ప్రాజెక్టు చేపట్టి పూర్తి చేశారు. ఆపరేషన్స్ అండ్ మెయింటనెన్స్ పద్ధతిలో కాంట్రాక్టర్ రిమోట్ ద్వారా ఆపరేటింగ్ చేస్తూ, ఏడేళ్లు లైటింగ్ నిర్వహణను కొనసాగిస్తారు.
మంత్రి కేటీఆర్ చేతుల మీదుగా ఓఆర్ఆర్ ఎల్ఈడీ లైటింగ్ గురువారం రాత్రి ప్రారంభమైంది. ప్రమాదరహిత రహదారిగా మార్చేందుకు తెలంగాణ ప్రభుత్వం ఈ చర్యలు తీసుకుంది.
ఎల్ఈడీ లైట్ల కాంతులు జిగేల్ మంటూ వాహనదారులు, ప్రయాణికులను ఆకట్టుకుంటున్నాయి. ప్రమాదాలు తగ్గుతాయని హర్షం వ్యక్తం చేస్తున్నారు.
సంగారెడ్డి జిల్లా వాసులతో పాటు ఇతర ప్రాంతాల నుంచి వచ్చే వారికి ఎల్ఈడీ లైట్లు ఎంతో ఉపయోగకరంగా మారతాయని పటాన్చెరు ఎమ్మెల్యే గూడెం మహిపాల్‌రెడ్డి అన్నారు.
సంగారెడ్డి జిల్లా పటాన్చెరు నియోజకవర్గంలో ఔటర్ రింగురోడ్డును 2010లో ప్రారంభించారు.
ఓఆర్ఆర్ ప్రారంభమయ్యాక హైదరాబాద్ చుట్టూ ఉన్న రంగారెడ్డి, సంగారెడ్డి ప్రాంతాల్లో రియల్ ఎస్టేట్ విలువ పెరిగింది. భూముల ధరలు కొండెక్కాయి.
సంగారెడ్డిలోని ఐడీఏ బొల్లారం నుంచి కొల్లూరు వరకు 25 కిలోమీటర్ల వరకు రింగురోడ్డు ఈ జిల్లా పరిధిలో ఉండటంతో ప్రయాణం సులభతరమైంది..
పటాన్చెరు జంక్షన్‌కు కిలోమీటర్ ముందు ఈ ఎల్ఈడీ లైట్లు ప్రారంభించారు. మొత్తంగా ఔటర్ రింగురోడ్డుపై 25 కిలోమీటర్ల వరకు ఎల్ఈడీ లైట్లు వెలుగులు నింపనున్నాయి.
image 10