Revanth Chandrababu Meeting: విభజన సమస్యల పరిష్కారం కోసం రేవంత్, చంద్రబాబు కీలక భేటీ
ఏపీ సీఎం చంద్రబాబుకు తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి, ఇతర మంత్రులు ఘన స్వాగతం పలికారు.
రాష్ట్ర విభజన పూర్తై పదేళ్లు గడిచినా, పరిష్కారం కాని సమస్యలపై చర్చించేందుకు తెలుగు రాష్ట్రాల సీఎంలు చంద్రబాబు, రేవంత్ రెడ్డి తమ టీంలతో ప్రజాభవన్ లో భేటీ అయ్యారు.
ఏపీ సీఎంగా చంద్రబాబు గెలుపొంది, బాధ్యతలు చేపట్టాక తొలిసారి తెలంగాణ పర్యటనకు వచ్చారు.
ఏపీ సీఎం చంద్రబాబు, తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డిలతో పాటు ఇద్దరు చొప్పున మంత్రులు, రెండు రాష్ట్రాల ప్రభుత్వ ప్రధాన కార్యదర్శులు విభజన సమస్యలపై జరిగిన సమావేశంలో పాల్గొన్నారు
ఏపీ సీఎం చంద్రబాబుకు తెలంగాణ ప్రముఖ కవి కాళోజీ నారాయణ రావు రచించిన నా గొడవ పుస్తకాన్ని సీఎం రేవంత్ రెడ్డి బహూకరించారు
ప్రజా భవన్ లో జరిగిన భేటీ సందర్భంగా ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు, తెలంగాణ మంత్రులు, ఉన్నతాధికారులు
తెలంగాణ డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్కకు కలియుగ దైవం శ్రీ వెంకటేశ్వర స్వామి ఫొటోను చంద్రబాబు బహూకరించారు
తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డికి శ్రీ వెంకటేశ్వర స్వామి ఫొటోను ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు బహూకరించారు
విభజన తరువాత నుంచి 10 ఏళ్లు గడుస్తున్నా పరిష్కారం కాని సమస్యలపై చర్చించేందుకు ఏపీ సీఎం చంద్రబాబు తెలంగాణకు వచ్చి రాష్ట్ర సీఎం, ప్రతినిధులతో భేటీ అయ్యి పలు అంశాలపై చర్చించారు