In Pics: కేసీఆర్ చెడ్డీ ఊడగొడతవా, నువ్వు చెడ్డీ గ్యాంగ్‌తో తిరిగావా రేవంత్ - హరీశ్ రావు
కరీంనగర్ ఎన్నికల ప్రచారంలో మాజీ మంత్రి హరీశ్ రావు మాట్లాడుతూ.. ‘‘గత ఎన్నికల్లో బీజేపీ భావోద్వేగాలు రెచ్చగొట్టడం వల్లే బండి సంజయ్ గెలిచాడు. ఐదేళ్లలో బండి సంజయ్ కరీంనగర్‌కు చేసిందేమీ లేదు. వినోదన్న ఓడిపోయినా కరీంనగర్ అభివృద్ధి కోసం పనిచేశారు’’ అని అన్నారు.
‘‘బీజేపీవాళ్లు ఇంటికో క్యాలెండర్, చిత్ర పటాలు పంచుతున్నారు. అవి కడుపు నింపుతాయా?’’
‘‘కాంగ్రెస్ వందరోజుల పాలనలోనే ప్రజలకు ఎన్నో కష్టాలు వచ్చాయి. మంచినీళ్లు సరిగ్గా రావడం లేదు. ఎన్నికల హమీలను అమలు చేయకుండా ప్రజలను దగా చేశారు. బాండు పేపర్లు రాసిచ్చి మరీ మోసం చేశారు.’’
‘‘మాట తప్పిన రేవంత్ రెడ్డీ.. ఎంపీ ఎన్నికల్లో ప్రజలు నీకు చురుకు పెడతారు. సొల్లు మాటలు తప్ప కాంగ్రెస్ లీడర్లు ఒక్క మంచి మాటన్నా చెబుతున్నారు’’
‘‘కేసీఆర్ చెడ్డి ఊడగొడుతా అంటున్నాడు రేవంత్. నువు చెడ్డి గ్యాంగ్ వెంట తిరిగినవా రేవంత్? ఇది ముఖ్యమంత్రి మాట్లాడే భాషనా?’’ అని హరీశ్ రావు మాట్లాడారు.