Revanth Reddy Davos Tour Photos: దావోస్ పర్యటనలో రేవంత్ రెడ్డి, తెలంగాణ సీఎం ఫొటోలు ట్రెండింగ్
జనవరి 15 నుంచి 18వ తేదీ వరకు స్విట్జర్లాండ్ లోని దావోస్‌లో వరల్డ్ ఎకనమిక్ ఫోరమ్ 54వ వార్షిక సదస్సు నిర్వహిస్తున్నారు. మూడు రోజుల పాటు జరగనున్న ఈ సదస్సులో తెలంగాణకు చెందిన ప్రతినిధులు హాజరయ్యారు.
దావోస్ పర్యటనలో ఉన్న తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి వరల్డ్ ఎకనామిక్ ఫోరం ప్రెసిడెంట్ బోర్గ్ బ్రెండెతో సోమవారం సమావేశమయ్యారు. తెలంగాణలో పెట్టుబడులకు అవకాశాలు, రాష్ట్రంలో ఏర్పడిన కొత్త ప్రభుత్వం వివరాలను WEF చీఫ్ కు రేవంత్ రెడ్డి వివరించారు.
వరల్డ్ ఎకనామిక్ ఫోరం ప్రెసిడెంట్ బోర్గ్ బ్రెండెతో పాటు ఇతర ప్రముఖులను, నిర్వాహకులతో తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి భేటీ అయ్యారు. తమ రాష్ట్రానికి పెట్టుబడులకు అవకాశాలపై ఆ ప్రతినిధులతో రేవంత్ రెడ్డి చర్చించారు.
ప్రపంచ ఆర్థిక సదస్సు (WEF 2024)లో పాల్గొనడానికి సీఎం రేవంత్ రెడ్డి, మంత్రి శ్రీధర్ బాబు స్విట్జర్లాండ్ లోని దావోస్ కు వెళ్లారు. పర్యటనలో భాగంగా జ్యూరిచ్ విమానాశ్రయంలో పలువురు భారత ప్రముఖులు వీరికి ఘన స్వాగతం పలికారు.
తెలంగాణ బృందం జ్యూరిచ్ ఎయిర్ పోర్ట్ లో దేశానికి చెందిన పలువురు ప్రముఖులను కలిసి వారితో కొద్దిసేపు మాట్లాడటం సంతోషాన్నిందన్నారు రేవంత్ రెడ్డి. రాష్ట్రాన్ని పెట్టుబడులు తీసుకొచ్చి మరింత అభివృద్ది చేసేందుకు దావోస్ ను వేదికగా చేసుకోవాలని రాష్ట్ర బృందానికి సూచించారు.
తెలంగాణలో కొత్త ప్రభుత్వ దార్శనికతను, ప్రాధాన్యతలను దిగ్గజ కంపెనీల ప్రతినిధులకు వివరించనున్నారు. ఐటీ రంగంలో అగ్రగామిగా, జీవ వైద్య శాస్త్ర రంగానికి ముఖ్య కేంద్రంగా అభివృద్ధి చెందిన తెలంగాణ బలాలను ప్రపంచానికి చాటి చెప్పి, భారీ పెట్టుబడులను ఆకర్షించడమే లక్ష్యంగా దేశ, అంతర్జాతీయంగా ఉన్న ప్రముఖ కంపెనీల ప్రతినిధులతో సమావేశం కానున్నారు.