In Pics: రోడ్డుపక్కన టీ కొట్టుకు చంద్రబాబు, స్థానికులతో ముచ్చట్లు - ఫోటోలు
ABP Desam | 13 Jun 2023 10:00 PM (IST)
1
ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి, టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడు మహబూబ్ నగర్ జిల్లా బాలానగర్ మండల కేంద్రంలో కాసేపు ఆగారు.
2
రోడ్డు పక్కన ఓ టీ దుకాణం ముందు కాసేపు కూర్చున్నారు.
3
మంగళవారం సాయంత్రం దేవరకద్ర మాజీ ఎమ్మెల్యే దయాకర్ రెడ్డి మృతదేహానికి నివాళులు అర్పించి తిరుగు ప్రయాణం అవుతున్న సందర్భంగా బాలనగర్ మండల కేంద్రంలోని పెద్దయపల్లి చౌరస్తాలో గల దోస్త్ టీ టైమ్ అనే టీ షాపు వద్ద కాసేపు ఆగారు.
4
అక్కడ తెలంగాణ తెలుగు దేశం అధ్యక్షుడు కాసానితో పాటు టేబుల్ చుట్టూ కూర్చొని ముచ్చటించారు.
5
ఈ సందర్భంగా అక్కడున్న స్థానికులతో చంద్రబాబు ముచ్చటించారు. తెలంగాణ ప్రభుత్వ పరిపాలన విధానంపై ప్రజలను అడిగి తెలుసుకున్నారు.