In Pics: వ్యాక్సిన్లను డ్రోన్లు ఎలా పట్టుకెళ్తున్నాయో చూడండి.. దేశంలో తొలిసారి వికారాబాద్‌లో..
దేశంలోనే తొలిసారిగా తెలంగాణలోని వికారాబాద్‌లో మందులు, వ్యాక్సిన్లను డ్రోన్ల ద్వారా పంపిణీ చేయడాన్ని ప్రారంభించారు. (Photo Credit: KTR/Twitter)
Download ABP Live App and Watch All Latest Videos
View In Appమారుత్ డ్రోన్ టెక్, అల్ఫా డిజిటల్ టెక్ కంపెనీలు సంయుక్తంగా తయారు చేసిన హెవీ పేలోడ్ డ్రోన్లను మందుల సరఫరాకు వాడుతున్నారు. (Photo Credit: KTR/Twitter)
బరువులను దూర ప్రాంతాలకు మోసుకుపోగలగడం ఈ డ్రోన్ల ప్రత్యేకత. (Photo Credit: KTR/Twitter)
డ్రోన్లకు అమర్చిన ఉష్ణోగ్రత నియంత్రణ గదిలో వ్యాక్సిన్లు లేదా మందులను ఉంచి పంపిణీ చేయవచ్చు. (Photo Credit: KTR/Twitter)
2.9 కిలోమీటర్ల దూరంలో ఉన్న ప్రాథమిక ఆరోగ్య కేంద్రానికి ఈ డ్రోన్లు వ్యాక్సిన్లను పంపిణీ చేశాయి. (Photo Credit: KTR/Twitter)
ఈ ప్రాజెక్టును కేంద్ర మంత్రి జ్యోతిరాదిత్య సింధియా ప్రారంభించారు. (Photo Credit: KTR/Twitter)
టెక్నాలజీ విషయంలో తెలంగాణ ముందుండడం ప్రశంసనీయం అని కేంద్ర మంత్రి జ్యోతిరాదిత్య సింధియా అన్నారు. (Photo Credit: KTR/Twitter)
ఈ కార్యక్రమంలో మంత్రి కేటీఆర్, సబితా ఇంద్రారెడ్డి, ఎమ్మెల్సీ సురభి వాణిదేవి, ఎమ్మెల్యేలు మెతుకు ఆనంద్, కాలె యాదయ్య, మహేశ్వర్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు. (Photo Credit: KTR/Twitter)