Batukamma Celebrations: బతుకమ్మ వేడుకల్లో గవర్నర్ తమిళిసై, ఎమ్మెల్సీ కవిత.. తెలుగు వర్సిటీలో ఘనంగా సంబరాలు..
హైదరాబాద్ నాంపల్లిలోని తెలుగు విశ్వవిద్యాలయంలో బతుకమ్మ వేడుకలు ఘనంగా జరిగాయి. ఈ వేడుకల్లో రాష్ట్ర గవర్నర్ తమిళిసై సౌందరరాజన్, ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత పాల్గొన్నారు.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appకవిత.. జ్యోతి ప్రజ్వలన చేసి ఈ కార్యక్రమాన్ని ప్రారంభించారు. అనంతరం కవిత మాట్లాడుతూ.. బతుకమ్మ పాటలో ఉండే తెలుగు పదాల మీద పరిశోధన చేస్తే, భాష మరింత పరిపుష్టం అవుతుందని అభిప్రాయపడ్డారు.
బతుకమ్మ అత్యంత ప్రాచీనమైన పండుగని.. తెలంగాణ జాగృతితో పాటు, అనేక సంస్థలు బతుకమ్మ పండుగకు సంబంధించి పాత పాటలు సేకరిస్తున్నారని కవిత తెలిపారు. పాత బతుకమ్మ పాటల్లో ఉండే పదాల మీద ప్రత్యేక అధ్యయనం చేపడితే.. మనం మరిచిపోతున్న తెలుగు పదాలు, తెలంగాణ పదాలు మళ్లీ భాషలో చేరే అవకాశం ఉందని పేర్కొన్నారు. దీని గురించి ఆలోచించాల్సిందిగా వర్సిటీ వైస్ ఛాన్సలర్ ను కోరారు.
రాజ్ భవన్ వేదికగా.. గవర్నర్ తమిళిసై ప్రతి రోజూ బతుకమ్మ వేడుకలు జరపడం సంతోషకరమని కవిత అన్నారు. ఇది తెలంగాణ ప్రజలకు ప్రభుత్వం తరఫున ఇస్తున్న గౌరవంగా భావిస్తున్నామని తెలిపారు.
బతుకమ్మ ఆడుతున్న గవర్నర్ తమిళిసై, ఎమ్మెల్సీ కవిత