In Pics: గణేష్ నిమజ్జనం వద్ద సీఎం రేవంత్, తొలిసారి ఒక సీఎం పరిశీలన
గణేష్ నిమజ్జన కార్యక్రమంలో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా నిర్విఘ్నంగా సాగేలా చూడాలని ముఖ్యమంత్రి ఎ. రేవంత్ రెడ్డి అధికారులను ఆదేశించారు.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appట్యాంక్‌బండ్ వద్ద నిమజ్జన ప్రదేశాలను రేవంత్ రెడ్డి పరిశీలించారు. నిమజ్జన ప్రక్రియ ముగిసే వరకు అన్ని శాఖల అధికారులు సమన్వయంతో పని చేయాలని చెప్పారు.
నిమజ్జన ప్రదేశాల్లో అమర్చిన క్రేన్స్ వద్ద పరిస్థితులను ముఖ్యమంత్రి గారు పరిశీలించారు. క్రేన్ డ్రైవర్స్, ఇతర సిబ్బందితో మాట్లాడారు.
మధ్య మధ్యలో విశ్రాంతి తీసుకునేలా సిబ్బందికి మూడు షిఫ్టుల్లో విధులు ఉండేలా ఏర్పాట్లు చేయాలని అధికారులకు సూచించారు. నిమజ్జనం కోసం వచ్చిన భక్తులను పలకరించారు. అధికారులకు అవసరమైన సూచనలు చేశారు.
ముఖ్యమంత్రి వెంట పలువురు ప్రజా ప్రతినిధులతో పాటు జీఎహెచ్ఎంసీ మేయర్, కమిషనర్, హైదరాబాద్ సిటీ పోలీస్ కమిషనర్ ఇతర అధికారులు ఉన్నారు.
అంతకుముందు ప్రజా పాలన దినోత్సవం (సెప్టెంబర్ 17) సందర్భంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అమర వీరులను స్మరిస్తూ గన్ పార్క్ అమర వీరుల స్తూపం వద్ద నివాళులు అర్పించారు.
ట్యాంక్ బండ్ వద్ద నెలల వయసు ఉన్న ఓ పిల్లాడిని సీఎం రేవంత్ ఎత్తుకుని ఆడించారు.
అధిక రద్దీ ఉండడంతో తన కాన్వాయ్ లో నిలబడే బాబును ఎత్తుకొని, అక్కడ నిమజ్జన వేడుకల్లో పాల్గొన్న భక్తులతో మాట్లాడారు.
నిమజ్జనం చూసేందుకు భారీగా వచ్చిన, రెయిలింగ్ అవతల ఉన్న జనానికి రేవంత్ రెడ్డి అభివాదం తెలిపారు.