ఒక్కొక్క జ్ఞాపకానికి వందేళ్ల ఆయువు- రామోజీరావు కథ ప్రతి సామాన్యుడికి ఓ స్ఫూర్తి పాఠం
రామోజీ గ్రూప్ సంస్థల ఛైర్మన్ రామోజీరావు(88) ఇవాళ కన్నుమూశారు. ఐదో తేదిన అస్వస్థకు గురైన ఆయన్ని ఆసుపత్రిలో చేర్పించారు. అక్కడ చికిత్స పొందుతూనే ఈ వేకువజామున కన్నుమూశారు.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appఆసుపత్రి నుంచి రామోజీరావు మృతదేహాన్ని తీసుకొచ్చి ఫిల్మ్‌సిటీలోని కార్పొరేట్ భవనంలో ఉంచారు. ఆయన భౌతిక కాయానికి వివిధ రంగాల ప్రముఖులు, కుటుంబ సభ్యులు, రామోజీ గ్రూప్ సంస్థల సిబ్బంది నివాళి అర్పిస్తున్నారు.
అందుకే ఒక రైతు బిడ్డగా ప్రారంభమైన రామోజీరావు ప్రయాణం మహా సామ్రాజ్యాధినేత ఎదిగారు. ఇందులో ఆయన ఎన్నో ఒడిదుడుకులు చూశారు. అయిన ఎక్కడా తలవంచిందిలేదు. వెనక్కి తగ్గింది లేదు. పోరాట స్ఫూర్తితోనే అన్ని కష్టనష్టాలను ఎదుర్కొన్నారు.
తెలుగు మీడియా మూసధోరణిలో సాగుతున్న టైంలో ఈనాడు దినపత్రిని 1974 ఆగస్టు 10న స్థాపించారు. విశాఖలో చిన్న భవనంలో ప్రారంభమైన ఈనాడు దినపత్రిక సంచలనంగా మారింది. అతి కొద్ది కాలంలోనే తెలుగు వారి మనసులకు దగ్గరైంది.
ఈనాడుతోపాటు సితార, సినీ పత్రిక, విపుల, చతుర, తెలుగువెలుగు, అన్నదాత, ఈటీవీ ఎంటర్టైన్మెంట్, ఈటీవీ న్యూస్ ఛానల్స్, ఈటీవీ భారత్, ప్రియా ఫుడ్స్, రామోజీ ఫిల్మ్ సిటీ, మయూరీ ఫిల్మ్‌డిస్ట్రిబ్యూషన్, ఉషాకిరణ్ మూవీస్, మార్గదర్శి ఇలా పెట్టిన ప్రాజెక్టును 100 శాతం విజయంతో తనకంటూ ప్రత్యేక ఒరవడి సృష్టించుకున్నారు.
పనిలోనే విశ్రాంతి ఇది రామోజీరావు వర్కింగ్ స్టైల్. చివరి శ్వాస వరకు అదే పంథాను సాగించారు. నలుగురికి నచ్చేది ఆయనకు అసలు నచ్చదు కొత్తగా ఆలోచించాలని చెబుతుంటారు. ఆయన చేపట్టిన ప్రాజెక్టులే అందుకు ఉదాహరణలు
జనాల మనసులకు దగ్గరగా ఉండే ప్రాజెక్టు చేపట్టడం ఆయన స్టైల్. ఈనాడు మొదలు కొని ఈటీవీ భారత్, బాలభారతం అన్నీ కూడా అదే పంథాలో వచ్చినవే. ప్రతి ప్రాజెక్టు చిన్న పిల్లల మాదిరిగా దగ్గరుండి బాగోగులు చూసుకోవడం ఆయనకు చాలా ఇష్టం.
రామోజీరావు తీసిన సినిమాల్లో కూడా కచ్చితంగా సందేశం ఉంటుంది. ఒక మయూరీ, ప్రతిఘటన ఇలాంటి సినిమాలు తెలుగు చలనచిత్ర రంగంలోనే ట్రెండ్ సెట్టర్స్‌గా నిలిచేవి. అవే కాకుండా నువ్వే కావాలిచిత్రంఆనందం లాంటి యూత్ ఓరియెంటెడ్ చిత్రాలు నిర్మించాలన్నా ఆయన తర్వాతే ఎవరైనా.
త్వరలోనే రామోజీరావు స్థాపించిన ఈనాడు పత్రిక యాభై ఏళ్లు పూర్తి చేసుకోనుంది. ఆగస్టు 18కి ఈనాడు దినపత్రి స్థాపించి 50 ఏళ్లు పూర్తి కానుంది. దాన్నిగ్రాండ్గా చేయాలని భావిస్తున్న టైంలో ఇలా రామోజీరావు అస్తమయం ఆ కుటుంబాన్ని కుంగదీస్తోంది.