In Pics: బీఆర్ఎస్ గా మారిన టీఆర్ఎస్, కేసీఆర్ అధికారిక ప్రకటన - తీర్మానంపై సంతకం
తెలంగాణ రాష్ట్ర సమితి (టీఆర్ఎస్) గా ఉన్న పార్టీ పేరును భారత రాష్ట్ర సమితి (బీఆర్ఎస్) గా మార్చడంతో పాటు టీఆర్ఎస్ను జాతీయ పార్టీగా మారుస్తూ పార్టీ సర్వసభ్య సమావేశంలో ఏకగ్రీవ తీర్మానం చేశారు.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appటీఆర్ఎస్ను బీఆర్ఎస్గా మారుస్తూ పార్టీ కార్యవర్గం ప్రవేశపెట్టిన తీర్మానాన్ని సభ్యులందరూ ఆమోదించారు. దీంతో మధ్యాహ్నం 1.19 గంటలకు బీఆర్ఎస్ పార్టీ పేరును ప్రకటించారు.
ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్‌రావు నేతృత్వంలో టీఆర్ఎస్ పార్టీ సర్వసభ్య సమావేశం తెలంగాణ భవన్ లో జరిగింది.
సమావేశంలో మాట్లాడిన సీఎం కేసీఆర్.. బీఆర్ఎస్ పార్టీ ఆవిర్భవించిందని ప్రకటించారు. 21 ఏళ్ల టీఆర్ఎస్ ప్రస్థానంలో దీన్ని కీలక మలుపుగా అభివర్ణించారు.
కార్యవర్గ సమావేశంలో తీర్మానం మాత్రమే చేశారు. ఈసీ ఆమోదించాల్సి ఉంది. ఈ తీర్మానంతో .. టీఆర్ఎస్ ప్రతినిధుల బృందం ఢిల్లీ వెళ్లి ఎన్నికలసంఘం ప్రతినిధులతో భేటీ అవుతుంది. వారికి సమర్పించి తెలంగాణ రాష్ట్ర సమితిపేరును రద్దు చేయించి.. భారత రాష్ట్ర సమితిగా మార్పు చేయిస్తారు.
తీర్మానానికి ఆమోదం తెలుపుతూ 283 మంది సభ్యులు ఆమోదముద్ర వేశారు. ఆ తర్వాత సంతకాలు చేశారు.
ఈ పరిణామం వేళ హైదరాబాద్‌లోని తెలంగాణ భవన్ వద్ద బీఆర్ఎస్ పార్టీ శ్రేణులు మిఠాయిలు పంచి, బాణసంచా పేల్చి సంబురాలు చేసుకున్నారు.