✕
  • హోమ్
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • ఆట
  • వెబ్ స్టోరీస్
  • ఫోటో గ్యాలరీ
  • ఫ్యాక్ట్ చెక్
  • బిగ్‌బాస్
  • సినిమా
  • టీవీ
  • సినిమా రివ్యూ
  • ఓటీటీ-వెబ్‌సిరీస్‌
  • పర్సనల్ ఫైనాన్స్
  • ఐపీవో
  • మ్యూచువల్ ఫండ్స్
  • ఆటో
  • మొబైల్స్‌
  • టీవీ
  • గాడ్జెట్స్
  • ల్యాప్‌టాప్
  • వాస్తు
  • శుభసమయం
  • ఫుడ్ కార్నర్
  • ఆరోగ్యం
  • ఆయుర్వేదం
  • ఎడ్యుకేషన్
  • వెబ్ స్టోరీస్
  • ఇండియా
  • యువ
  • క్రైమ్
  • జాబ్స్
  • ట్రెండింగ్
  • రైతు దేశం
  • పాలిటిక్స్
  • న్యూస్
  • ప్రపంచం
  • హైదరాబాద్
  • అమరావతి
  • విశాఖపట్నం
  • విజయవాడ
  • రాజమండ్రి
  • కర్నూల్
  • తిరుపతి
  • నెల్లూరు
  • వరంగల్
  • నల్గొండ
  • కరీంనగర్
  • నిజామాబాద్

Miss World 2025: సచివాలయాన్ని సందర్శించిన ప్రపంచ అందగత్తెలు, ఆకట్టుకున్న డ్రోన్‌ షో Photos

Shankar Dukanam   |  18 May 2025 10:32 PM (IST)
1

రాష్ట్ర పాలన కేంద్రం తెలంగాణ సచివాలయానికి చేరుకున్న మిస్ వరల్డ్ కంటెస్టెంట్లు సందడి చేశారు.

2

సచివాలయంలో తెలంగాణ తల్లి విగ్రహానికి పుష్పాంజలి ఘటించారు మిస్ వరల్డ్ కాంటెస్టులో పాల్గొంటున్న ముద్దుగుమ్మలు. మిస్ ఇండియా నందిని గుప్తా ఈ కార్యక్రమానికి నేతృత్వం వహించారు.

3

మిస్ వరల్డ్ సుందరీమణులు తెలంగాణ రాష్ట్ర సచివాలయాన్ని సందర్శించారు. అనంతరం అక్కడ వారి కోసం డ్రోన్ షో ఏర్పాటు చేశారు.

4

గత కొన్ని రోజులుగా మిస్ వరల్డ్ బ్యూటీలు తెలంగాణలోని పలు చారిత్రక ప్రదేశాలను సందర్శిస్తున్నారు. ఆదివారం నాడు హైదరాబాద్ లోని రాష్ట్ర సచివాలయాన్ని సందర్శించారు

5

సెక్రటేరియట్‌లో తెలంగాణ తల్లి విగ్రహానికి పుష్పాంజలి ఘటించిన అనంతరం అందగత్తెలు ఫొటోలకు పోజులిచ్చారు. తెలంగాణ తల్లి విగ్రహం వద్ద సెల్ఫీలు తీసుకుని సందడి చేశారు.

6

తెలంగాణ ప్రభుత్వం ప్రత్యేక వంటకాలతో ముద్దుగుమ్మలకు తేనీటి విందు ఏర్పాటు చేసింది. రాష్ట్ర ప్రభుత్వ ఆతిథ్యానికి అందగత్తెలు ఫిదా అవుతున్నారు.

7

మిస్‌ వరల్డ్‌ కంటెస్టెంట్స్‌ రాష్ట్ర సచివాలయం సందర్శించిన సందర్భంగా ఏర్పాటు చేసిన డ్రోన్‌ షో అందర్నీ ఆకట్టుకుంది.

8

పాతబస్తీ గుల్జార్ హౌస్ ఫైర్ ఆక్సిడెంట్ మృతులకు సచివాలయంలో మిస్ వరల్డ్ కంటెస్టెంట్లు, మంత్రులు, అధికారులు కొద్ది నిమిషాలు మౌనం పాటించి నివాళులు అర్పించారు.

9

తెలంగాణ పర్యాటక ప్రాంతాలను సుస్థిర అభివృద్దిలో భాగంగా పర్యావరణ హితంగా డెవలప్ చేస్తున్నామని, వాటిలో చాలా ప్రాంతాలను సందర్శించిన మిస్ వరల్డ్ కంటెస్టంట్లు తెలంగాణకు బ్రాండ్ అంబాసిడర్లుగా ప్రపంచవ్యాప్తంగా పనిచేయాలని మంత్రి జూపల్లి కృష్ణారావు కోరారు.

10

సచివాలయం సాక్షిగా తెలంగాణ జరూర్ ఆనా (Must Visit Telangana) అంటూ మిస్ వరల్డ్ కంటెస్టెంట్లు నినదించారు.

11

తెలంగాణ ప్రభుత్వ ప్రాధాన్యతలు, పథకాల అమలు తీరును మిస్ వరల్డ్ కంటెస్టెంట్లకు పరిచయం చేసేలా డ్రోన్ షో కొనసాగింది.

12

రైజింగ్ తెలంగాణ, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చిత్రపటం ఆకాశంలో డ్రోన్లతో ఆవిష్కరించినప్పుడు ఆహుతులంతా చప్పట్లతో ఆహ్వానించారు.

13

యువతకు స్కిల్ యూనివర్సిటీ, తెలంగాణ తల్లి, రాజీవ్ ఆరోగ్య శ్రీ, రేవంతన్న సన్నబియ్యం, మహిళలకు ఉచిత బస్సు సౌకర్యం, సబ్సిడీ సిలిండర్, ఇందిరా మహిళాశక్తి తదితర పథకాలను తెలిపేలా ఆకాశంలో డ్రోన్ల ద్వారా ప్రదర్శించారు.

14

సుమారు వేయి డ్రోన్లతో చేసిన విన్యాసాలు మిస్ వరల్డ్ కంటెస్టంట్లతో పాటు హాజరైన ప్రముఖులను అలరించాయి.

15

ఈ కార్యక్రమంలో పర్యాటక శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు, రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్, ఇతర ప్రజాప్రతినిధులు, తెలంగాణ చీఫ్ సెక్రటరీ రామకృష్ణారావు, ఉన్నతాధికారులు పాల్గొన్నారు.

  • హోమ్
  • ఫోటో గ్యాలరీ
  • హైదరాబాద్
  • Miss World 2025: సచివాలయాన్ని సందర్శించిన ప్రపంచ అందగత్తెలు, ఆకట్టుకున్న డ్రోన్‌ షో Photos
About us | Advertisement| Privacy policy
© Copyright@2025.ABP Network Private Limited. All rights reserved.