Aadhaar Card Photo Change : ఆధార్లో మీ ఫోటో నచ్చకపోతే ఇలా మార్చేసుకోండి.. ప్రాసెస్ సింపులే
ఇండియాలో ఆధార్ కార్డు అనేది ఐడెంటీటి కార్టులలో అత్యంత ప్రధానంగా ఉంటుంది. దాదాపు ప్రతి ముఖ్యమైన పనికి ఆధార్ అవసరం ఉంటుంది.
ఆధార్లో పేరు, అడ్రస్ మార్పులు చేసుకోవడం వంటివి రెగ్యులర్గా చూస్తూనే ఉంటాం. ఆధార్ కార్డ్, పాన్ కార్డ్, ఫోన్ లింక్ వంటివి వింటూనే ఉన్నాము.
అయితే చాలామందికి ఆధార్ కార్డు ఫోటోలు మార్చుకోవడం ప్రక్రియ గురించి పెద్దగా తెలియదు. అయితే మీరు చాలా సింపుల్గా ఆధార్ కార్డులో ఫోటోలు మార్చుకోవచ్చు.
ఆధార్లో ఫోటో మార్చుకోవడానికి ముందుగా.. UIDAI వెబ్సైట్ uidai.gov.inకు లాగిన్ అవ్వాలి. దానిలో ఆధార్ నమోదు ఫారం డౌన్లోడ్ చేసుకోవాలి. దానిలో డిటైల్స్ నమోదు చేసి.. ఆధార్ సెంటర్లో సమర్పించాలి.
అనంతరం ఆధార్ నమోదు కేంద్రంలో సిబ్బంది మీ బయోమెట్రిక్ వివరాలతో పాటు మీ ఫోటోను తీసుకుంటారు. 25 రూపాయలు కడితే కొత్త ఫోటోను అప్డేట్ చేస్తారు.
URNతో కూడిన స్లిప్ ఇస్తారు. మీ ఆధార్ కార్డు ఫోటో మారిందో లేదో చెక్ చేసుకోవచ్చు. అప్డేట్ అయిన తర్వాత ఆధార్ కార్డును డౌన్లోడ్ చేసుకోవచ్చు.