KTR: ఫార్ములా ఈ -కార్ రేసింగ్ కేసులో ఏసీబీ విచారణకు హాజరైన కేటీఆర్- బొట్టుపెట్టి దీవించి పంపిన బీఆర్‌ఎస్ నేతలు
ఫార్ములా ఈ -కార్ రేసింగ్ కేసులో ఏసీబీ విచారణకు బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మాజీ మంత్రి కేటీఆర్ హాజరయ్యారు.
విచారణకు వెళ్లే ముందు కేటీఆర్‌తో బీఆర్‌ఎస్ నేతలు సమావేశమయ్యారు. ఆయన్ని బొట్టుపెట్టి దీవించి విచారణకు పంపించారు.
ఇప్పటికే ఈ కేసులో జనవరిలో ఒకసారి ఏసీబీ విచారణకు కేటీఆర్ హాజరయ్యారు. ఇప్పుడు రెండోసారి విచారణకు హాజరయ్యారు.
విచారణకు బయల్దేరే ముందు మీడియాతో కూడా కేటీఆర్ మాట్లాడారు. తనను వెయ్యిసార్లు పిలిచినా విచారణకు వస్తానని అన్నారు. ఎన్నికేసులు పెట్టినా ప్రభుత్వాన్ని ప్రశ్నించడం ఆపబోనని స్పష్టం చేశారు.
తమకు జైలు కేసులు కొత్త కాదు గతంలో తెలంగాణ ఉద్యమంలో కూడా జైలుకు వెళ్లొచ్చానని అన్నారు. ఫార్ములా ఈ రేసులో తెలంగాణను ప్రపంచంలో నెంబర్ వన్ చేశామన్నారు కేటీఆర్. రేవంత్ రెడ్డి ఇచ్చిన హామీలు, వాగ్దానాలు నెరవేరేవరకు ప్రశ్నిస్తూనే ఉంటామన్నారు.
జైలుకు వెళ్లేందుకు భయం లేదన్నారు కేటీఆర్. ఒక్కసారి కాదు వందసార్లు అయినా జైలుకు పోతామన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వాన్ని వదిలిపెట్టే ప్రసక్తే లేదని పేర్కొన్నారు.