In Pics: ఉప్పల్లో ఆకాశ మార్గం ప్రారంభం - రిబ్బన్ కట్ చేసిన మంత్రి కేటీఆర్
ఉప్పల్ కూడలిలో వాహనాల రద్దీ ఎక్కువైనందున రోడ్లు దాటేందుకు ప్రజలు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appఅందుకే పాదచారులు ఎలాంటి ఇబ్బందులు ఎదుర్కోకుండా రోడ్డు దాటేందుకు ఉప్పల్ చౌరస్తాలో స్కైవాక్ నిర్మించారు.
రూ.36.50 కోట్ల ఖర్చుతో స్కైవాక్ నిర్మించారు.
ఈ స్కైవాక్ ను ఐటీ, మున్సిపల్ శాఖ మంత్రి కేటీఆర్ సోమవారం (జూన్ 26) ప్రారంభించారు.
ప్రయాణికులు రామంతాపూర్ నుంచి ఉప్పల్ వైపు.. ఉప్పల్ వైపు నుంచి రామంతాపూర్ వైపు..
నాగోల్ వైపు నుంచి హబ్సీగూడ వైపు.. హబ్సీగూడ వైపు నుంచి నాగోల్ వైపు పాదచారులు స్కైవాక్ ద్వారా భద్రంగా రోడ్డు దాటొచ్చు.
మంత్రి కేటీఆర్ తో పాటు మరో మంత్రి మల్లారెడ్డి కూడా ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.
స్కైవాక్ పై నడుస్తూ స్థానికులకు అభివాదం చేస్తున్న కేటీఆర్
అనంతరం ఏర్పాటు చేసిన సభలో కేటీఆర్ మాట్లాడారు.