Khairatabad Ganesh Photos: ఖైరతాబాద్ గణపతి శోభాయాత్ర, నిమజ్జనం ఫోటోలు.. ఇదే చివరిసారి చూడండి!
ఖైరతాబాద్‌లో ఈ ఏడాది ప్రతిష్ఠించిన మహా రుద్రగణపతి విగ్రహ నిమజ్జనం పూర్తయింది. ఆదివారం మధ్యాహ్నం 3.25 నిమిషాలకు హైదరాబాద్‌లోని హుస్సేన్ సాగర్‌లో భారీ విగ్రహాన్ని క్రేన్ల సాయంతో నిమజ్జనం చేశారు.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appక్రేన్ నెంబరు 4 వద్ద మహా గణపతి నిమజ్జనం జరిగింది. నిమజ్జన కార్యక్రమాల సందర్భంగా పెద్ద ఎత్తున భక్తులు ట్యాంక్ బండ్‌కు పోటెత్తారు.
ఖైరతాబాద్ వినాయక విగ్రహం నిమజ్జనం జరుగుతుండగా పక్కనే ఉన్న భక్తులు పోటీ పడుతూ గణపయ్యతో సెల్ఫీలు దిగారు. ఈ భారీ గణపతి విగ్రహ నిమజ్జనాన్ని ప్రత్యక్షంగా వేలాది మంది భక్తులు కళ్లార్పకుండా తిలకించారు.
పంచముఖ రుద్ర మహా గణపతి రూపంలో భక్తులకు దర్శనమిచ్చిన ఖైరతాబాద్ గణేశుడి శోభాయాత్ర ఆదివారం ఉదయం 8.18 గంటలకు ప్రారంభమైంది.
భక్తుల కోలాహలం మధ్య శోభాయాత్ర సందడిగా సాగింది. ట్యాంక్ బండ్‌పై తుది పూజల అనంతరం మహా గణపతి నిమజ్జనం కోసం తరలింది.
చివరి రోజు మహా గణపతి దర్శనం కోసం ట్యాంక్ బండ్‌కు భారీగా భక్తులు తరలివచ్చారు.
9 రోజులుగా మహాగణపతి దర్శనం కోసం హైదరాబాద్ సహా వివిధ ప్రాంతాల నుంచి భారీగా భక్తులు తరలివచ్చిన సంగతి తెలిసిందే.
ఖైరతాబాద్ వినాయక విగ్రహాన్ని వచ్చే ఏడాది నుంచి మండపంలోనే నిమజ్జనం చేయాలని భాగ్య నగర్ ఉత్సవ కమిటీ కీలక నిర్ణయం తీసుకున్న సంగతి తెలిసిందే.
వచ్చే ఏడాది నుండి పూర్తిగా మట్టి వినాయకుడినే తయారు చేయించాలని కూడా కమిటీ నిర్ణయం తీసుకుంది.
వచ్చే ఏడాది 70 అడుగుల మట్టి గణపతిని తయారు చేయాలని.. విగ్రహాన్ని అదే స్థానంలో నీటిని వేగంతో చిమ్ముతూ అక్కడికక్కడే నిమజ్జనం చేయాలని చూస్తున్నారు.
ఇప్పటికే తెలంగాణ హైకోర్టు ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్ విగ్రహాలను హుస్సేన్ సాగర్‌లో నిమజ్జనం చేయొద్దని ఆదేశాలిచ్చిన సంగతి తెలిసిందే. దీంతో ప్రభుత్వం సుప్రీంకోర్టుకు వెళ్లి ఈ ఒక్కసారికి అనుమతులు తెచ్చుకుంది.