Bahadurpura Flyover Photos: హైదరాబాద్‌లో కొత్త ప్లైఓవర్ ప్రారంభం - బహదూర్ పురా ప్లైఓవర్ ఫొటోలు చూశారా !
విశ్వనగరం హైదరాబాద్‌లో మరో ఫ్లై ఓవర్ నేడు అందుబాటులోకి వచ్చింది. ట్రాఫిక్ కష్టాలు తొలగించేందుకు తెలంగాణ ప్రభుత్వం చేపట్టిన పనులలో భాగంగా నిర్మించిన బహదూర్ పురా ప్లైఓవర్‌ను రాష్ట్ర ఐటీ, పురపాలక శాఖల మంత్రి కేటీఆర్ ప్రారంభించారు. (Photos Credit: Twitter)
Download ABP Live App and Watch All Latest Videos
View In Appనగరం నుంచి శంషాబాద్ విమానాశ్రయం, మహబూబ్ నగర్ జిల్లాల వైపు రాకపోకలు సాగించే వారికి ట్రాఫిక్ కష్టాలు పరిష్కరించేందుకు పాతబస్తీలోని బహదూర్ పురా జంక్షన్ వద్ద టీఆర్ఎస్ సర్కార్ ఫ్లై ఓవర్ నిర్మించింది. ఈ ఫ్లై ఓవర్ పొడవు 690 మీటర్లు. (Photos Credit: Twitter)
వీటితో పాటు దాదాపు రూ. 500 కోట్లతో చేపట్టనున్న ముర్గీచౌక్, మీరాలం మండి, సర్దార్ మహల్ ఆధునీకరణ మరియు పలు అభివృద్ధి పనులకు మంత్రి కేటీఆర్ శంకుస్థాపన చేశారు. (Photos Credit: Twitter)
ఈ కార్యక్రమంలో హోం మంత్రి మహమూద్ అలీ, ఎంపీ అసదుద్దీన్ ఒవైసీ, ఎమ్మెల్సీ సురభివాణి దేవి, హైదరాబాద్ సీపీ సీవీ ఆనంద్, తదితరులు పాల్గొన్నారు. (Photos Credit: Twitter)
బహదూర్ పుర ఫ్లై ఓవర్ అందుబాటులోకి రావడంతో నగరంలోని పాతబస్తీ ఏరియాలో ట్రాఫిక్ కష్టాలు దాదాపుగా తగ్గనున్నాయి. ఈ ఫ్లైవర్ ద్వారా తూర్పు ప్రాంతం నుంచి శంషాబాద్ వరకు, శంషాబాద్ నుంచి తూర్పు ప్రాంతం మధ్య రాకపోకలు సులభతరం కానున్నాయి. (Photos Credit: Twitter)
బహదూర్ పుర ఫ్లై ఓవర్ నిర్మాణం, భూ సేకరణ నిమిత్తం రూ.108 కోట్లు మేర రాష్ట్ర ప్రభుత్వం ఖర్చు చేసింది. అదే సమయంలో ఫ్లై ఓవర్ కింది భాగంలో సుందరీకరణ పనులకు సైతం ప్రభుత్వం శ్రీకారం చుట్టింది. ఈ ఫ్లై ఓవర్ ద్వారా ఆరాంఘర్ నుంచి ఉప్పల్ వరకు ట్రాఫిక్ సమస్యలు తీరనున్నాయి. (Photos Credit: Twitter)
ఫ్లై ఓవర్‌తో పాటు దాదాపు రూ. 500 కోట్లతో చేపట్టనున్న ముర్గీచౌక్, మీరాలం మండి, సర్దార్ మహల్ ఆధునీకరణ మరియు పలు అభివృద్ధి పనులకు మంత్రి కేటీఆర్ శంకుస్థాపన చేశారు. (Photos Credit: Twitter)
బహదూర్ పురా ప్లైఓవర్ డ్రోన్ ఫొటో (Photos Credit: Twitter)
బహదూర్ పురా ప్లైఓవర్ నేడు అందుబాటులోకి వచ్చింది. హైదరాబాద్ నుంచి శంషాబాద్ ఎయిర్ పోర్ట్, అటువైపు జిల్లాలకు వెళ్లే వారికి ట్రాఫిక్ కష్టాలు తీరతాయి. (Photos Credit: Twitter)