Neera Cafe: నెక్లెస్ రోడ్డులో నీరా కేఫ్ ప్రారంభం, ఆల్కహాల్ ఉండదన్న మంత్రి శ్రీనివాస్ గౌడ్
హైదరాబాద్ లోని నెక్లెస్ రోడ్డులో తెలంగాణ మంత్రులు శ్రీనివాస్ గౌడ్, తలసాని శ్రీనివాస్ యాదవ్.. నీరా కేంద్రాన్ని ప్రారంభించారు.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appఅనంతరం స్వామీజీలతో కలసి వేదికపై నీరా పానియాన్ని సేవించారు. నీరాలో సున్నా శాతం ఆల్కహాల్ ఉంటుందని.. ఇది హానికరమైన పానియం కాదని మంత్రి శ్రీనివాస్ గౌడ్ తెలిపారు.
నీరా పానియంపై ఎవరూ తప్పుడు ప్రచారం చేయొద్దని.. వీలైనంత వరకు దీన్ని ప్రతిరోజూ తాగాలని సూచించారు.
రాష్ట్రంలో రైతు బీమా అమలు చేస్తున్నట్లుగానే కల్లుగీత కార్మికుల కోసం ‘గీత కార్మికుల బీమా’ ను అమలు చేయాలని నిర్ణయించిన ముఖ్యమంత్రి కేసీఆర్ కు ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు.
కల్లుగీస్తూ ప్రమాదవశాత్తూ ప్రాణాలను కోల్పోయిన గీత కార్మికుని కుటుంబానికి రూ. 5 లక్షల బీమా సాయాన్ని నేరుగా వారి ఖాతాలో జమయ్యేలా ప్రభుత్వం చర్యలు తీసుకోబోతుందని వివరించారు.
తెలంగాణలో కల్లుగీత కార్మికులకు ‘గీత కార్మికుల బీమా’ పథకాన్ని అమలు చేయాలని బీఆర్ఎస్ అధినేత, సీఎం కేసీఆర్ నిర్ణయించారు.
కల్లు గీస్తూ ప్రమాదంలో ఎవరైనా గీత కార్మికులు చనిపోతే వారి కుటుంబానికి రూ. 5 లక్షల బీమా అందజేస్తామన్నారు.