Chevella Road Accident Photos: చేవెళ్ల ఘోర రోడ్డు ప్రమాదం.. నడుం లోతు కంకరలో ఇరుక్కుని నరకయాతన.. భయానక దృశ్యాలు
రంగారెడ్డి జిల్లా చేవెళ్ల మండలం మీర్జాగూడ వద్ద ఆర్టీసీ బస్సును, రాంగ్ రూటులో వచ్చిన కంకర లోడుతో వెళ్తున్న లారీ ఢీకొట్టింది. అనంతరం బస్సు మీద లారీ ఒరిగి పడిపోయింది.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appలారీ లోని కంకర లోడ్ వర్షం కురిసినట్లుగా బస్సులోని వారిని కమ్మేసింది. ఈ ప్రమాదంలో మరణించిన వారిలో అత్యధికంగా మహిళలే ఉన్నారు.
కొందరు ప్రయాణికులు ఆ కంకర కింద ఊపిరాడక చనిపోయారు. కొందరు తీవ్రంగా గాయపడి ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు.
నడుము లోతు వరకు కంకర రాళ్లు కప్పేయడంతో బస్సు నుంచి బయటకు రాలేక ప్రయాణికులు నరకయాతన అనుభవించారు.
జేసీబీల సాయంతో బస్సులో చిక్కుకున్న వారిని కొందర్ని కాపాడి చేవెళ్ల ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. మృతదేహాలను సైతం బస్సు నుంచి వెలికితీశారు.
ఈ ప్రమాదంలో మొత్తం 19 మంది మృతిచెందగా, మరికొందరు తీవ్రగాయాలతో ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు.
కేంద్ర ప్రభుత్వం మృతుల కుటుంబాలకు రూ.2 లక్షలు, గాయపడిన వారికి రూ.50 వేలు పరిహారం ప్రకటించింది. తెలంగాణ ప్రభుత్వం మృతుల కుటుంబాలకు రూ.5 లక్షలు, గాయపడిన వారికి రూ.2 లక్షలు పరిహారం అందిస్తామని ప్రకటించింది.
ఢీకొట్టిన తరువాత కంకర లోడుతో ఉన్న లారీ బస్సు మీద ఒరగడంతో ప్రాణ నష్టం అధికంగా సంభవించినట్లు తెలుస్తోంది. రాష్ట్రపతి ముర్ము, ప్రధాని మోదీ, తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి, ఏపీ సీఎం చంద్రబాబు ఈ ఘటనపై దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. గాయపడిన వారు త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించారు.