KTR Pics: ఇన్నోవేషన్ ఎవరి సొత్తుకాదు.. వాళ్లని ప్రోత్సహించాల్సిందే.. మంత్రి కేటీఆర్ వెల్లడి
ఆవిష్కరణ (ఇన్నోవేషన్) ఎవరి సొత్తు కాదని, కొత్త తరం పరికరం కనిపెట్టిన ఎవరినైనా సరే ప్రోత్సహించాలని మంత్రి కేటీఆర్ సూచించారు.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appహైదరాబాద్ రాజేంద్రనగర్‌లో ఉన్న ప్రొఫెసర్ జయశంకర్ వ్యవసాయ విశ్వవిద్యాలయంలో ఏర్పాటు చేసిన ‘అగ్రి ఇన్నోవేషన్ హబ్’ను మంత్రులు కేటీఆర్, నిరంజన్‌రెడ్డి, సబిత ఇంద్రారెడ్డి ప్రారంభించారు.
2,601 రైతు వేదికలను టీ-ఫైబర్ ద్వారా అనుసంధానం చేస్తామని కేటీఆర్ తెలిపారు. వర్సిటీలో పరిశోధనలు పెరగాలని.. అగ్రి హబ్‌లో తెలుగుకు పెద్దపీట వేయాలని అన్నారు.
సిరిసిల్ల ప్రాంతంలో 6 మి.మీ. భూగర్భ జలం పెరగడంపై ముస్సోరి ఐఏఎస్ అకాడమీలో పాఠ్యాంశంగా బోధిస్తున్నారని గుర్తు చేశారు.
రాష్ట్రంలో 20 లక్షల ఎకరాల్లో ఆయిల్ పామ్ పండించాలని లక్ష్యంగా పెట్టుకున్నామని, ఈ విషయంలో మనం దేశానికే ఆదర్శంగా నిలవాలని చెప్పారు.
టెక్నాలజీ సామాన్యుడికి ఉపయోగపడకపోతే అది నిష్ర్రయోజనమని కేసీఆర్ అంటుంటారని కేటీఆర్ అన్నారు.
బ్లాక్ చైన్, రోబోటిక్, క్లౌడ్, డ్రోన్ టెక్నాలజీలు అందుబాటులోకి వస్తున్నట్లు సాంకేతికతను అందిపుచ్చుకోవడంలో భారతీయులు ముందుంటారని కేటీఆర్ అన్నారు.
‘‘టెక్నాలజీని అందిపుచ్చుకోవడంలో భారతీయులు మొదటి స్థానంలో ఉన్నారు. అగ్రి హబ్‌లో తెలుగు భాషకు పెద్దపీట వేయాలి.’’ అని కేటీఆర్ అన్నారు.