Election Results 2024
(Source: ECI/ABP News/ABP Majha)
In Pics: యశోద ఆసుపత్రి నుంచి సీఎం కేసీఆర్ డిశ్చార్జ్
ముఖ్యమంత్రి కేసీఆర్‌కు అన్ని రకాల వైద్య పరీక్షలు చేశాక అబ్జర్వేషన్‌లో ఉంచిన అనంతరం డాక్టర్లు ఆయన్ను డిశ్చార్జి చేశారు. మధ్నాహ్నం 3 గంటల సమయంలో కేసీఆర్ డిశ్చార్జి అయ్యారు.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appడిశ్చార్జి సమయంలో ఆయన చేతికి తెలుపు రంగు పట్టీ ఉంది. ఆయనే స్వయంగా నడుచుకుంటూ లిఫ్టు ద్వారా కిందికి వచ్చారు. ఈ సందర్భంగా సీఎం నీరసంగా కనిపించారు.
తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్(KCR) శుక్రవారం స్వల్ప అస్వస్థతకు గురయ్యారు. దీంతో వెంటనే ఆయన సోమాజిగూడ యశోద ఆస్పత్రికి (Yashoda Hospital)కు తరలించారు. ఈ సందర్భంగా వైద్యులు కేసీఆర్‌కు యాంజియోగ్రామ్, సిటీ స్కాన్ పరీక్షలు నిర్వహించారు.
సీఎం కేసీఆర్ కు ప్రివెంటివ్ చెకప్‌లో భాగంగా రక్త పరీక్షలు, కరోనరీ యాంజియోగ్రాం, ఎంఆర్ఐ స్పైన్, ఎంఆర్ఐ బ్రెయిన్ కూడా చేశామని వైద్యులు తెలిపారు. యాంజియోగ్రాం చాలా నార్మల్‌గా ఉందన్నారు. ఆయనకి కార్డియాక్ ప్రాబ్లం ఏం లేదని వైద్యులు తెలిపారు.
సీఎం కేసీఆర్ అస్వస్థతతో యశోద ఆసుపత్రిలో జాయిన్ అయ్యారు. ఆయనతో పాటు కుటుంబ సభ్యులు కూడా ఉన్నారు.
యశోద ఆసుపత్రి నుంచి డిశ్చారైన సీఎం కేసీఆర్ ప్రగతి భవన్ కు వెళ్లారు.
ముఖ్యమంత్రి కేసీఆర్ (KCR Health Bulletin) ఆరోగ్యం గురించి యశోద ఆస్పత్రి వైద్యులు ప్రెస్ మీట్ నిర్వహించారు. ఈ మేరకు సీఎం హెల్త్ పై అధికారికంగా ప్రకటన చేశారు.