MLC Kavitha : నటుడు అర్జున్ నిర్మించిన హనుమాన్ ఆలయంలో ఎమ్మెల్సీ కవిత పూజలు
బీర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత చెన్నైలో యాక్షన్ కింగ్ అర్జున్ నిర్మించిన హనుమాన్ ఆలయంలో కవిత ప్రత్యేక పూజలు చేశారు.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appఅర్జున్ దంపతులు కల్వకుంట్ల కవితకు ఘనస్వాగతం పలికారు. దేశంలోని అతిపెద్ద హనుమాన్ దేవాలయాన్ని నిర్మించినందుకు నటుడు అర్జున్ కు కవిత అభినందనలు తెలిపారు
ప్రముఖ ఆంగ్ల పత్రిక నిర్వహించనున్న సదస్సులో పాల్గొనడానికి చెన్నై వెళ్లారు బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్సీ కల్వకంట్ల కవిత. పనిలోపనిగా యాక్షన్ కింగ్, సినీ హీరో అర్జున్ నిర్మించిన హనుమాన్ దేవాలయాన్ని సందర్శించి ప్రత్యేక పూజలు చేశారు.
దేశంలోని అతిపెద్ద హనుమాన్ దేవాలయాన్ని నిర్మించినందుకు నటుడు అర్జున్ కు కవిత అభినందనలు తెలిపారు.
హీరో అర్జున్ నిర్మించిన హనుమాన్ ఆలయం
ఆలయంలో హారతి తీసుకుంటున్న ఎమ్మెల్సీ కవిత
హీరో అర్జున్ కుటుంబంతో ఎమ్మెల్సీ కవిత
కల్వకుంట్ల కవిత మీడియాతో మాట్లాడుతూ చెన్నైలో పర్యటించడం తనకు సంతోషంగా ఉందన్నారు. తమిళనాడు అస్తిత్వం చాలా గొప్పదని, అక్కడి ప్రజలు స్ఫూర్తిదాయకంగా ఉంటారని కొనియాడారు.