Revanth Reddy Speech: జ్వోతి ప్రజ్వలన చేసి సదరన్ రైజింగ్ సమ్మిట్ ప్రారంభించిన సీఎం రేవంత్ రెడ్డి
తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి ఏబీపీ నెట్ వర్క్ నిర్వహిస్తోన్న సదరన్ రైజింగ్ సమ్మిట్ లో ముఖ్య అతిథిగా పాల్గొన్నారు.
సీఎం రేవంత్ రెడ్డి జ్వోతి ప్రజ్వలన చేసి సదరన్ రైజింగ్ సమ్మిట్ ను ఘనంగా ప్రారంభించారు.
మాజీ ప్రధాని జవహర్ లాల్ నెహ్రూ నుంచి మన్మోహన్ సింగ్ హయాంలో దేశానికి కాంగ్రెస్ పార్టీ చేసిన సేవల్ని కొనియాడారు. దక్షిణాదిన నాగార్జున సాగర్, శ్రీశైలం ప్రాజెక్టు లాంటి ఎన్నో నిర్మించి సాగునీటి, తాగునీటి అవసరాలు తీర్చిందని రేవంత్ రెడ్డి పేర్కొన్నారు.
కాంగ్రెస్, యూపీఏ అధికారంలో ఉన్న సమయంలో నార్త్ ఇండియా, సౌత్ ఇండియా పూర్తి దేశంలో అన్ని వర్గాలకు న్యాయం జరిగిందన్నారు. ఎన్నికలు కాకుండా ప్రజా సంక్షేమమే ధ్యేయంగా కాంగ్రెస్ పనిచేసిందని రేవంత్ పేర్కొన్నారు
జనాభాలో మనం ముందున్నా, కొన్ని అంశాల కారణంగా అభివృద్ధిలో మాత్రం వెనుకబడుతున్నాం అని రేవంత్ కీలక వ్యాఖ్యలు చేశారు. వనరులు ఉన్నా కేంద్ర ప్రభుత్వం కొన్ని ప్రాంతాలకు మాత్రమే అభివృద్ధిని పరిమితం చేసిందన్నారు.