✕
  • హోమ్
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • ఆట
  • వెబ్ స్టోరీస్
  • ఫోటో గ్యాలరీ
  • ఫ్యాక్ట్ చెక్
  • బిగ్‌బాస్
  • సినిమా
  • టీవీ
  • సినిమా రివ్యూ
  • ఓటీటీ-వెబ్‌సిరీస్‌
  • పర్సనల్ ఫైనాన్స్
  • ఐపీవో
  • మ్యూచువల్ ఫండ్స్
  • ఆటో
  • మొబైల్స్‌
  • టీవీ
  • గాడ్జెట్స్
  • ల్యాప్‌టాప్
  • వాస్తు
  • శుభసమయం
  • ఫుడ్ కార్నర్
  • ఆరోగ్యం
  • ఆయుర్వేదం
  • ఎడ్యుకేషన్
  • వెబ్ స్టోరీస్
  • ఇండియా
  • యువ
  • క్రైమ్
  • జాబ్స్
  • ట్రెండింగ్
  • రైతు దేశం
  • పాలిటిక్స్
  • న్యూస్
  • ప్రపంచం
  • హైదరాబాద్
  • అమరావతి
  • విశాఖపట్నం
  • విజయవాడ
  • రాజమండ్రి
  • కర్నూల్
  • తిరుపతి
  • నెల్లూరు
  • వరంగల్
  • నల్గొండ
  • కరీంనగర్
  • నిజామాబాద్

Google AI: గూగుల్ సెర్చ్ విధానం మారింది! కొత్త AI మోడ్ వచ్చింది, ఎలా ఉపయోగించాలో తెలుసుకోండి

Khagesh   |  08 Jul 2025 09:55 PM (IST)
1

గూగుల్ ప్రకారం ఈ ఫీచర్ భారతదేశంలో క్రమంగా అందరు వినియోగదారులకు అందుబాటులోకి వస్తోంది. రాబోయే రోజుల్లో వినియోగదారులకు గూగుల్ సెర్చ్‌లో కొత్త 'AI Mode' ట్యాబ్ కనిపిస్తుంది, ఇది సెర్చ్ ఫలితాలు, గూగుల్ యాప్ సెర్చ్ బార్లో కనిపిస్తుంది. ప్రస్తుతం ఈ ఫీచర్ కేవలం ఆంగ్ల భాషలో మాత్రమే అందుబాటులో ఉంది, కానీ ఇందులో సెర్చ్ లాబ్స్ వెర్షన్ అన్ని ఫీచర్లు ఉంటాయి.

2

ఏఐ మోడ్ గూగుల్ జెమిని 2.5 మల్టీమోడల్ ఏఐ మోడల్ పై ఆధారపడి ఉంది. ఇది వినియోగదారులకు మునుపెన్నడూ లేనంత సహజమైన సెర్చ్‌ ఫలితాలను అందిస్తుంది. వినియోగదారులు మాట్లాడటం ద్వారా ప్రశ్నలు అడగవచ్చు, ఏదైనా చిత్రాన్ని అప్లోడ్ చేయవచ్చు లేదా గూగుల్ లెన్స్ ద్వారా ఫోటో తీసి దాని ఆధారంగా ప్రశ్నలు అడగవచ్చు.

3

ఉదాహరణకు మీరు ఒక మొక్క చిత్రాన్ని అప్‌లోడ్ చేస్తే AI మోడ్ దాన్ని గుర్తించడమే కాకుండా దాని సంరక్షణకు సంబంధించిన సమాచారాన్ని కూడా అందించగలదు. అదేవిధంగా ఏదైనా గృహోపకరణం విరిగిపోతే దాని ఫోటో ద్వారా దాన్ని ఎలా రిపేర్ చేయాలో అడగవచ్చు.

4

గూగుల్ నాలెడ్జ్ గ్రాఫ్, రియల్ టైమ్ లోకల్ సమాచారం, షాపింగ్ రిజిల్ట్స్‌ మొదలైన వాటిని AI మోడ్‌లో కలిపి వినియోగదారులకు మరింత ఉపయోగకరమైన సందర్భోచిత సమాచారం అందిస్తుంది. ఈ ఫీచర్ గూగుల్ యాప్ Android, iOS రెండు వెర్షన్లలో అందుబాటులో ఉంది.

5

ఈ AI మోడ్ ప్రత్యేకంగా సంక్లిష్టమైన, మల్టీ లెవల్‌ ప్రశ్నల కోసం రూపొందించినట్టు గూగుల్ చెబుతోంది. దీనికి సాధారణంగా అనేక విభిన్న శోధనలు అవసరం. ఉదాహరణకు, ఎవరైనా స్మార్ట్‌ఫోన్‌ను పోల్చాలనుకుంటే, ట్రిప్ ప్లాన్ చేస్తుంటే లేదా DIY ప్రాజెక్ట్ చేస్తుంటే, AI మోడ్ వీటన్నింటిలో సహాయం చేస్తుంది.

6

ఉదాహరణకు, ఎవరైనా “4 - 7 సంవత్సరాల పిల్లలను ఇంట్లో తక్కువ ఖర్చుతో ఎలా బిజీగా ఉంచాలి?” అని తెలుసుకోవాలనుకుంటే, వారు వేర్వేరు విషయాలను శోధించాల్సిన అవసరం లేదు. AI మోడ్ ఒకే ప్రశ్నకు సంబంధించిన పూర్తి సమాచారం, సూచనలు లింక్‌లను ఒకే చోట అందిస్తుంది.

7

ఏఐ మోడ్ “క్వెరీ ఫ్యాన్-ఔట్” అనే సాంకేతికతను ఉపయోగిస్తుంది. ఇందులో ఒక సంక్లిష్టమైన ప్రశ్నను చిన్న చిన్న భాగాలుగా విభజించి వాటిని వెబ్‌లో ఒకేసారి శోధిస్తారు. దీని ద్వారా వినియోగదారులకు మరింత లోతైన, విస్తృతమైన సమాచారం లభిస్తుంది, ఇది సాంప్రదాయ కీవర్డ్-ఆధారిత శోధనల కంటే చాలా మెరుగైనది.

  • హోమ్
  • ఫోటో గ్యాలరీ
  • మొబైల్స్‌
  • Google AI: గూగుల్ సెర్చ్ విధానం మారింది! కొత్త AI మోడ్ వచ్చింది, ఎలా ఉపయోగించాలో తెలుసుకోండి
About us | Advertisement| Privacy policy
© Copyright@2025.ABP Network Private Limited. All rights reserved.