✕
  • హోమ్
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • ఆట
  • వెబ్ స్టోరీస్
  • ఫోటో గ్యాలరీ
  • ఫ్యాక్ట్ చెక్
  • బిగ్‌బాస్
  • సినిమా
  • టీవీ
  • సినిమా రివ్యూ
  • ఓటీటీ-వెబ్‌సిరీస్‌
  • పర్సనల్ ఫైనాన్స్
  • ఐపీవో
  • మ్యూచువల్ ఫండ్స్
  • ఆటో
  • మొబైల్స్‌
  • టీవీ
  • గాడ్జెట్స్
  • ల్యాప్‌టాప్
  • వాస్తు
  • శుభసమయం
  • ఫుడ్ కార్నర్
  • ఆరోగ్యం
  • ఆయుర్వేదం
  • ఎడ్యుకేషన్
  • వెబ్ స్టోరీస్
  • ఇండియా
  • యువ
  • క్రైమ్
  • జాబ్స్
  • ట్రెండింగ్
  • రైతు దేశం
  • పాలిటిక్స్
  • న్యూస్
  • ప్రపంచం
  • హైదరాబాద్
  • అమరావతి
  • విశాఖపట్నం
  • విజయవాడ
  • రాజమండ్రి
  • కర్నూల్
  • తిరుపతి
  • నెల్లూరు
  • వరంగల్
  • నల్గొండ
  • కరీంనగర్
  • నిజామాబాద్

Mi Smart Band 6: ఎంఐ నుంచి స్మార్ట్ బ్యాండ్.. ధర, ఫీచర్లు ఇవే..

ABP Desam   |  02 Sep 2021 01:52 PM (IST)
1

ప్రముఖ స్మార్ట్ ఫోన్ బ్రాండ్ షియోమీ తన కొత్త స్మార్ట్ బ్యాండ్‌ను మనదేశంలో లాంచ్ చేసింది. ఎంఐ స్మార్ట్ బ్యాండ్ 6 పేరుతో లాంచ్ అయిన దీని ధర రూ.3,499గా ఉంది. దీని సేల్ ఇప్పటికే ప్రారంభం కానుంది. అమెజాన్, ఎంఐ.కాం, ఎంఐ హోం స్టోర్లలో దీన్ని కొనుగోలు చేయవచ్చు. ఇప్పటికే ఎంఐ బ్యాండ్ వాడుతున్నవారు దీన్ని రూ.2,999కే కొనుగోలు చేయవచ్చని షియోమీ తెలిపింది.

2

షియోమీ స్మార్టర్ లివింగ్ 2022 ఈవెంట్‌లో భాగంగా దీనిని విడుదల చేసింది. ఇందులో మొత్తం 30 స్పోర్ట్స్ మోడ్స్ ఉన్నాయి. బ్లడ్ ప్రెషర్ (బీపీ), బ్లడ్ ఆక్సిజన్, హార్ట్ రేట్ మానిటరింగ్, స్లీప్ ట్రాకింగ్ వంటి ఫీచర్లను ఇందులో అందించారు.

3

బ్లాక్ కలర్ స్ట్రిప్‌తో ఇది అందుబాటులోకి వచ్చింది. దీనికి అదనంగా బ్లూ, లైట్ గ్రీన్, ఆరెంజ్, మెరూన్ కలర్ ఆప్షన్లు కూడా అందించింది. అయితే వీటిని ప్రత్యేకంగా కొనుగోలు చేయాల్సి ఉంటుందని షియోమీ తెలిపింది. అమ్మాయిల కోసం ప్రత్యేకంగా ఫిమేల్ హెల్త్ ట్రాకింగ్ అనే ఫీచర్ అందించారు. ఇది ఫిట్‌నెస్ ట్రాకర్‌గా కూడా పనిచేస్తుంది. వాకింగ్, రన్నింగ్, ఇండోర్ ట్రెడ్ మిల్, సైక్లింగ్ వంటి ఆరు యాక్టివిటీలను ఇది ఆటోమెటిగ్గా డిటెక్ట్ చేస్తుంది.

4

ఎంఐ స్మార్ట్ బ్యాండ్ 6లో 1.56 అంగుళాల ఫుల్ స్క్రీన్ అమోఎల్ఈడీ టచ్ డిస్‌ప్లే అందించారు. ఎంఐ బ్యాండ్ 5లో కంటే ఇది చాలా పెద్ద డిస్‌ప్లే. వాటర్ ప్రూఫ్ ఫీచర్ ఇందులో ప్రత్యేకమని చెప్పవచ్చు.

5

125 ఎంఏహెచ్‌గా బ్యాటరీ కెపాసిటీ అందించారు. దీని స్టాండ్ బై టైం 14 రోజుల వరకు ఉంటుంది. ఇది పూర్తిగా చార్జ్ కావడానికి 2 గంటలు పడుతుంది. ఇది బ్లూటూత్ 5.0ను సపోర్ట్ చేస్తుంది. 80కి పైగా కస్టమైజబుల్ బ్యాండ్ ఫేస్‌లను ఇందులో అందించింది.

  • హోమ్
  • ఫోటో గ్యాలరీ
  • టెక్
  • Mi Smart Band 6: ఎంఐ నుంచి స్మార్ట్ బ్యాండ్.. ధర, ఫీచర్లు ఇవే..
About us | Advertisement| Privacy policy
© Copyright@2025.ABP Network Private Limited. All rights reserved.