✕
  • హోమ్
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • ఆట
  • వెబ్ స్టోరీస్
  • ఫోటో గ్యాలరీ
  • ఫ్యాక్ట్ చెక్
  • బిగ్‌బాస్
  • సినిమా
  • టీవీ
  • సినిమా రివ్యూ
  • ఓటీటీ-వెబ్‌సిరీస్‌
  • పర్సనల్ ఫైనాన్స్
  • ఐపీవో
  • మ్యూచువల్ ఫండ్స్
  • ఆటో
  • మొబైల్స్‌
  • టీవీ
  • గాడ్జెట్స్
  • ల్యాప్‌టాప్
  • వాస్తు
  • శుభసమయం
  • ఫుడ్ కార్నర్
  • ఆరోగ్యం
  • ఆయుర్వేదం
  • ఎడ్యుకేషన్
  • వెబ్ స్టోరీస్
  • ఇండియా
  • యువ
  • క్రైమ్
  • జాబ్స్
  • ట్రెండింగ్
  • రైతు దేశం
  • పాలిటిక్స్
  • న్యూస్
  • ప్రపంచం
  • హైదరాబాద్
  • అమరావతి
  • విశాఖపట్నం
  • విజయవాడ
  • రాజమండ్రి
  • కర్నూల్
  • తిరుపతి
  • నెల్లూరు
  • వరంగల్
  • నల్గొండ
  • కరీంనగర్
  • నిజామాబాద్

Smartphone Tips: స్మార్ట్‌ఫోన్ మీ మాటలు వింటుందా? మీ ప్రైవసీకి ముప్పు వాటిల్లే చాన్స్- ఇదిగో పరిష్కారం

Shankar Dukanam   |  25 Jul 2025 03:47 PM (IST)
1

ఇప్పుడు స్మార్ట్ ఫోన్ ప్రజల జీవితంలో భాగం అయిపోయింది. కేవలం ఆడియో, వీడియో కాల్స్ కోసం మాత్రమే కాదు.. ఫోన్ లోని యాప్స్ ద్వారా ఆర్థిక లావాదేవీలు జరుపుతున్నారు. కొందరు వినోదం కోసం వాడతారు. కొందరు ఫోటోలు, వీడియోలు తీయడం సహా చాలా పనులు చేస్తారు. కానీ మీ ఫోన్ మీ మాటలను రహస్యంగా వింటుందని ఎప్పుడైనా గమనించారా?

2

చాలా మందికి ఇలాంటి సందేహం వచ్చి ఉంటుంది. మనం ఏదైనా మాట్లాడితే కొన్ని నిమిషాల్లోనే అదే విషయం సోషల్ మీడియాలో కనిస్తుంది. దాంతో మీ అనుమానం రెట్టింపైన సందర్భాలు లేకపోలేదు. అయితే ఇది ఎందుకు జరుగుతుంది. వాస్తవానికి మీకు తెలియకుండానే చాలా యాప్‌లకు మైక్రోఫోన్ యాక్సెస్ అనుమతిని ఇచ్చి ఉంటారు.

3

ఒక యాప్ మైక్రోఫోన్ యాక్సెస్ పర్మిషన్ అడిగిందంటే అది కేవలం కాల్స్ లేదా వాయిస్ కమాండ్ల కోసం మాత్రమే ఉపయోగించాలని కాదు. కొన్ని యాప్స్ సీక్రెట్‌గా మీ మాటలను వినేస్తుంటాయి. దీని ద్వారా ఆ స్మార్ట్‌ఫోన్ యూజర్ ప్రవర్తన, ఇష్టాలు, అయిష్టాలు లాంటివి కూడా ట్రాక్ చేయవచ్చు.

4

మీ ఫోన్లో ఇన్‌స్టాల్ చేసిన కొన్ని యాప్స్ బ్యాక్‌గ్రౌండ్లో మీకు తెలియకుండానే డేటాను సేకరిస్తాయి. ముఖ్యంగా సోషల్ మీడియా, కీబోర్డ్, షాపింగ్ యాప్‌లో ఇది మీరు గమనించి ఉంటారు. చాలాసార్లు ఈ యాప్స్ థర్డ్ పార్టీకి సమాచారాన్ని పంపుతాయి. వీటిని యాడ్స్, మరియు మార్కెటింగ్లో ఎక్కువగా ఉపయోగిస్తారు.

5

ఈ సమస్యను నివారించడానికి మార్గం ఏమిటంటే మీ ఫోన్ సెట్టింగ్స్‌కు వెళ్లి ఏ యాప్ మైక్రోఫోన్, కెమెరా లొకేషన్ లేదా స్టోరేజ్ పర్మిషన్ ఉందో లేదో చూడండి. అవసరం లేకుండా ఏదైనా యాప్ మైక్రోఫోన్‌ను ఉపయోగిస్తుంటే వెంటనే ఆ యాక్సెస్ ఆపివేస్తే సరి.

6

ఏదైనా తెలియని యాప్ ఇన్‌స్టాల్ చేయకూడదు. మీరు కేవలం ప్లే స్టోర్ లేదా యాప్ స్టోర్ నుంచి మాత్రమే యాప్స్ డౌన్లోడ్ చేయాలి. ముఖ్యంగా పబ్లిక్ వైఫై లేదా ఉచిత నెట్వర్క్స్ వాడుతున్నప్పుడు మరింత జాగ్రత్తగా ఉండాలి. తరచుగా అక్కడి నుంచే ఫోన్ డేటాకు యాక్సెస్ అయ్యే అవకాశం ఉంది.

  • హోమ్
  • ఫోటో గ్యాలరీ
  • టెక్
  • Smartphone Tips: స్మార్ట్‌ఫోన్ మీ మాటలు వింటుందా? మీ ప్రైవసీకి ముప్పు వాటిల్లే చాన్స్- ఇదిగో పరిష్కారం
About us | Advertisement| Privacy policy
© Copyright@2025.ABP Network Private Limited. All rights reserved.