శ్రావణమాసంలో మూడో రోజు హరియాలి తీజ్ - ఈ రోజు ఆకుపచ్చని కొత్తగాజులు వేసుకోవాలి, ఎన్నంటే?
హరియాలి తీజ్ నాడు ఆకుపచ్చ గాజులు వేసుకోవడం శుభ ప్రదంగా భావిస్తారు, ఎందుకంటే ఆకుపచ్చ రంగు ప్రకృతి, పచ్చదనానికి చిహ్నం. శివునికి ఈ రంగు అంటే చాలా ఇష్టం. అందుకే హరియాలి తీజ్ నాడు స్త్రీలు ఆకుపచ్చ రంగు చీరలు, గాజులు ధరిస్తారు.
హరియాలి తీజ్ నాడు, వివాహిత స్త్రీలు ఆకుపచ్చ రంగు లేదా ఏదైనా రంగు గాజులను బేసి సంఖ్యలో ధరించాలి. 5, 7, 11 లేదా 21 సంఖ్యలో గాజులు ధరించడం శుభంగా పరిగణిస్తారు
పచ్చ రంగు దేవి పార్వతికి ప్రీతికరం. హరియాలి తీజ్ నాడు పచ్చ రంగు గాజులు ధరించడం వల్ల అఖండ సౌభాగ్యం లభిస్తుంతని నమ్మకం పచ్చ గాజులు భర్త దీర్ఘాయువు, ఆరోగ్యం మరియు సుఖకరమైన వైవాహిక జీవితాన్ని కోరుకుంటాయని నమ్ముతారు.
గాజులు వేసుకునేటప్పుడు ఈ విషయాన్ని గుర్తుంచుకోండి పాత గాజులను రెండు చేతులకు ఒకేసారి తీయకూడదు. ముందు కుడి చేతి గాజులు మార్చుకుని ఆ తర్వాత ఎడమ చేతికి వేసుకోవాలి.
సౌభాగ్యవంతులైన మహిళలకు గాజులు చాలా పవిత్రమైనవిగా పరిగణిస్తారు. కొత్త గాజులు ధరించే ముందు వాటిని పార్వతీ దేవి పాదాల వద్ద సమర్పించండి, అలా చేయడం సాధ్యం కాకపోతే చేతులు జోడించి అమ్మవారిని ధ్యానించండి, ఆ తర్వాత గాజులు ధరించండి ఇది శుభప్రదంగా ఉంటుంది.
ఏటా శ్రావణమాసం ప్రారంభమైన మూడో రోజు హరియాలి తీజ్ జరుపుకుంటారు. ఈ ఏడాది జూలై 25న శ్రావణమాసం ప్రారంభమైంది.. హరియాలి తీజ్ జూలై 27 ఆదివారం వచ్చింది. ఈ రోజు సుమంగళి స్త్రీలకు ఆకుపచ్చ గాజులు ఇవ్వండి