Google Maps Dark Mode: ఐఫోన్ యూజర్లకు గుడ్ న్యూస్.. త్వరలో కొత్త ఫీచర్లు..
ఐఫోన్ యూజర్లకు శుభవార్త. త్వరలోనే యాపిల్ ఫోన్లలో గూగుల్ మ్యాప్స్ డార్క్ మోడ్, లైవ్ లొకేషన్ ఫీచర్లు రానున్నాయి. యాపిల్ ఫోన్లలో ఉపయోగించే ఆపరేటింగ్ సిస్టమ్ ఐఓఎస్ 13 అప్ డేట్లలో భాగంగా డార్క్ మోడ్ ను తొలగించిన విషయం తెలిసిందే. దాదాపు రెండేళ్ల తర్వాత డార్క్ మోడ్ అందుబాటులోకి రానుంది.
డార్క్ మోడ్‌ని ఆన్ చేయడానికి, సెట్టింగ్స్ మెనూకు వెళ్లాలి. తర్వాత డార్క్ మోడ్ ఆప్షన్ ఎంచుకోవాలి. గూగుల్ మ్యాప్స్‌లో లైట్, డార్క్ మోడ్స్ రావాలంటే.. సిస్టమ్ సెట్టింగ్స్‌కు తగినట్లుగా ఆప్షన్ మార్చుకోవాలి. ఆగస్టులో ఐఓఎస్ యూజర్లకు మరిన్ని ఫీచర్లను అందించాలని గూగుల్ ప్లాన్ చేస్తున్నట్లు తెలుస్తోంది.
దీనికి సంబంధించిన వివరాలను ద వెర్జ్ వెల్లడించింది. దీని అంచనా ప్రకారం.. గూగుల్ మ్యాప్స్ రెండు విభిన్న ఆప్షన్లను అందిస్తుంది. ఒకటి మనకు సమీపంలోని ట్రాఫిక్ పరిస్థితులను చూపిస్తుంది. మరొకటి గూగుల్ మ్యాప్స్ సెర్చ్ బార్, మీ ఇల్లు, సమీపంలోని రెస్టారెంట్లు వంటి కొన్ని షార్ట్‌కట్‌లను చూపుతుంది.
సెర్చ్ ఇంజిన్ దిగ్గజం త్వరలో తన యూజర్లకు ఐమెసేజ్ (iMessage) నుండి లైవ్ లొకేషన్ పంచుకునే వీలు కల్పిస్తుంది. ఇది ఇంటర్నెట్ లేకపోయినా పనిచేస్తుంది. లైవ్ లొకేషన్ డిఫాల్ట్‌గా ఒక గంట పాటు మాత్రమే షేర్ అవుతుంది. అయితే దీనిని మూడు రోజుల వరకు షేర్ చేసుకునే సదుపాయం ఉంది.