వావ్ అనిపించే లుక్‌తో సూపర్ ఫీచర్లతో వచ్చిన శాంసంగ్ గెలాక్సీ ఎస్24 సిరీస్ - ఎలా ఉందో చూశారా?
శాంసంగ్ గెలాక్సీ ఎస్24 సిరీస్‌ను కంపెనీ భారతదేశంలోనూ, గ్లోబల్ మార్కెట్లలోనూ లాంచ్ చేసింది. ఈ సిరీస్‌లో మొత్తం మూడు ఫోన్లు మార్కెట్లో ఎంట్రీ ఇచ్చాయి. అవే శాంసంగ్ గెలాక్సీ ఎస్24, శాంసంగ్ గెలాక్సీ ఎస్24 ప్లస్, శాంసంగ్ గెలాక్సీ ఎస్24 అల్ట్రా మొబైల్స్.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appశాంసంగ్ గెలాక్సీ ఎస్24 అల్ట్రా క్వాల్‌కాం స్నాప్‌డ్రాగన్ 8 జెన్ 3 ప్రాసెసర్‌పై పని చేయనుంది. శాంసంగ్ గెలాక్సీ ఎస్24, ఎస్24 ప్లస్‌ల్లో క్వాల్‌కాం చిప్ లేదా శాంసంగ్ ఎక్సినోస్ 2400 ప్రాసెసర్ అందించనున్నారు.
శాంసంగ్ గెలాక్సీ ఎస్24 ధర 8 జీబీ ర్యామ్ + 256 జీబీ స్టోరేజ్ వేరియంట్ ధర రూ.79,999గా నిర్ణయించారు. ఇందులో 8 జీబీ ర్యామ్ + 512 జీబీ స్టోరేజ్ వేరియంట్ ధర రూ.89,999గా ఉంది. యాంబర్ ఎల్లో, కోబాల్ట్ వయొలెట్, ఓనిక్స్ బ్లాక్ కలర్ ఆప్షన్లలో ఈ స్మార్ట్ ఫోన్‌ను కొనుగోలు చేయవచ్చు.
శాంసంగ్ గెలాక్సీ ఎస్24 ప్లస్ 12 జీబీ ర్యామ్ + 256 జీబీ స్టోరేజ్ వేరియంట్ ధర రూ.99,999గా ఉంది. టాప్ ఎండ్ మోడల్ అయిన 12 జీబీ ర్యామ్ + 512 జీబీ స్టోరేజ్ వేరియంట్ ధరను రూ.1,09,999గా నిర్ణయించారు.
శాంసంగ్ గెలాక్సీ ఎస్24 అల్ట్రా 12 జీబీ ర్యామ్ + 256 జీబీ స్టోరేజ్ వేరియంట్‌ను కొనాలంటే రూ.1,29,999గా ఖర్చు పెట్టాల్సి ఉంటుంది. మిడ్ రేంజ్ 12 జీబీ ర్యామ్ + 512 జీబీ స్టోరేజ్ వేరియంట్ ధర రూ.1,39,999గానూ, టాప్ ఎండ్ 12 జీబీ ర్యామ్ + 1 టీబీ స్టోరేజ్ వేరియంట్ ధర రూ.1,59,999గానూ నిర్ణయించారు.
ఈ మొబైల్‌కు సంబంధించిన ప్రీబుకింగ్స్ ఇప్పటికే ప్రారంభం అయ్యాయి. ప్రస్తుతం జరుగుతున్న శాంసంగ్ లైవ్ ఈవెంట్లో ఈ ఫోన్లను బుక్ చేసుకుంటే రూ.4,999 విలువ చేసే శాంసంగ్ వైర్‌లెస్ ఛార్జర్ ఉచితంగా లభించనుంది. ఈ స్మార్ట్ ఫోన్లకు సంబంధించిన అధికారిక సేల్ తేదీని కంపెనీ ఇంకా ప్రకటించలేదు.