Wimbledon 2021: వింబుల్డన్ 2021 విజేతలు వీళ్లే
Wimbledon 2021 పురుషుల, మహిళల సింగిల్స్ విజేతలు జకోవిచ్, ఆష్లే బార్టీ
వింబుల్డన్ 2021లో ఆస్ట్రేలియా ప్లేయర్ ఆష్లే బార్టీ మహిళల సింగిల్స్ విభాగంలో గెలిచి సరికొత్త చరిత్ర సృష్టించింది.
41 ఏళ్ల తర్వాత ఈ విభాగంలో ఆస్ట్రేలియాకు టైటిల్ సాధించింది.
మహిళల సింగిల్స్‌లో వింబుల్డన్ టైటిల్‌ను గెలుచుకున్న మూడో ఆస్ట్రేలియా క్రీడాకారిణిగా బార్టీ నిలిచింది.
2014 లో టెన్నిస్‌ను నిరవధికంగా విడిచిపెట్టింది. ఈ సమయంలో ఆస్ట్రేలియాలో దేశీయ క్రికెట్, బిగ్ బాష్ టి 20 లీగ్‌లో పాల్గొంది.
2016 లో మళ్ళీ టెన్నిస్‌కు తిరిగి వచ్చింది. 2019 లో బార్టీ ఫ్రెంచ్ ఓపెన్ టైటిల్‌తో తన మొదటి గ్రాండ్‌స్లామ్‌ను గెలుచుకుంది.
వింబుల్డన్ పురుషుల సింగిల్స్ టైటిల్‌ను వరల్డ్ నెంబర్ వన్, సెర్బియా స్టార్ నొవాక్ జొకోవిచ్ కైవసం చేసుకున్నాడు.
మహిళల సింగిల్స్ రన్నరప్, చెక్ రిపబ్లిక్ ప్లేయర్ కరోలినా ప్లిస్కోవా.
Men's Doubles Champion: Mate Pavic and Nikola Mektic
Women's Doubles Champion: Hsieh Su-wei and Elise Mertens
పురుషుల సింగిల్స్ రన్నరప్, ఇటలీ ప్లేయర్ మాటియో బెరెటిని.