Tokyo Olympics: 4వ రోజు చిత్రాలు... మనిక బాత్ర ఓటమి... శరత్ కమల్ ముందంజ
జపాన్‌కి చెందిన 14 ఏళ్ల మొమిజి నిషియా బంగారు పతకం సాధించింది. స్కేట్ బోర్డింగ్‌లో ఆమె స్వర్ణం దక్కించుకుంది
ఒలింపిక్స్‌లో భారత ఏకైక ఫెన్సర్ భవానీ దేవి రెండో రౌండ్లో ఓడిపోయింది. ప్రపంచ మూడో ర్యాంకర్ మేనన్ బ్రూనెట్ (ఫ్రాన్స్) తో పోరాడి వెనుదిరిగింది.
పురుషుల డబుల్స్ బ్యాడ్మింటన్‌లో సాత్విక్-చిరాగ్ జోడీ పరాజయం పాలైంది. ఇండోనేషియాపై 21-13, 21-12 తేడాతో ఓడిపోయింది.
టేబుల్ టెన్నిస్ క్రీడాకారుడు శరత్ కమాల్ రెండో రౌండ్లో విజయం సాధించి 3వ రౌండ్‌కి చేరాడు.
పురుషుల సింగిల్స్ రెండో రౌండ్లో టెన్నిస్ క్రీడాకారుడు సుమిత్ నగాల్ ఓడిపోయాడు. రష్య ఆటగాడు డానిల్ మెద్వైత్‌పై వరుసగా రెండు సెట్లలో ఓడిపోయాడు.
రజత పతకం సాధించిన చాను స్వదేశానికి పయనమైంది.
టేబుల్ టెన్నిస్‌లో మనిక బాత్ర 3వ రౌండ్లో ఓడిపోయింది. ఆస్ట్రియా క్రీడాకారిణి సోఫియా చేతిలో ఘోర పరాజయం పాలైంది.
మహిళల టేబుల్ టెన్నిస్ సింగిల్స్‌లో సుతీర్థ రెండో రౌండ్లో ఓడిపోయింది.