Tokyo Olympics: ఘనంగా టోక్యో ఒలింపిక్స్ ప్రారంభోత్సవం
అట్టహాసంగా ప్రారంభమైన టోక్యో ఒలింపిక్స్
ప్రారంభోత్సవ కార్యక్రమంలో ఒలింపిక్ జ్యోతిని వెలిగించిన జపాన్ టెన్నిస్ క్రీడాకారిణి నవోమి ఒసాకా
విద్యుద్దీపకాంతుల్లో ఒలింపిక్ ప్రారంభోత్సవం
కరోనా వైరస్ వ్యాప్తి కారణంగా కేవలం 1000 మంది అతిథుల సమక్షంలో జరిగిన ఈ ప్రారంభోత్సవం జరిగింది.
ఈరోజు నుంచి ఆగస్టు 8 వరకూ టోక్యో ఒలింపిక్స్ జరగనున్నాయి.
వాస్తవానికి గత ఒలింపిక్స్ వరకూ పతాకధారిగా ఒకరికే అవకాశం లభించేది. కానీ.. ఈ సారి పురుషుల నుంచి ఒకరికి, మహిళల నుంచి ఒకరికి ఈ ఛాన్స్ లభించింది.
భారీ సంఖ్యలో క్రీడాభిమానులు లేకున్నా.. బాణాసంచా పేల్చి.. నృత్యప్రదర్శనలు, లైట్‌షో నిర్వహించి ఘనంగా ప్రారంభోత్సవ కార్యక్రమాన్ని నడిపించారు.
వేడుకలో భాగంగా పోటీల్లో పాల్గొనే వివిధ దేశాలకు చెందిన అథ్లెట్లు వారి జాతీయ పతాకంతో మార్చ్‌లో పాల్గొన్నారు.
ఈ ప్రారంభోత్సవ కార్యక్రమానికి జపాన్ చక్రవర్తి నరుహిటో, ఫ్రాన్స్ అధ్యక్షుడు ఇమ్మాన్యుయెల్ మాక్రాన్, యూఎస్ ప్రథమ మహిళ జిల్ బైడెన్ హాజరయ్యారు.
త్రివర్ణ పతాకాన్ని ప్రదర్శిస్తూ మార్చ్‌ఫాస్ట్ చేసిన భారత పురుషుల తరఫున హాకీ జట్టు సారథి మన్‌ప్రీత్ సింగ్, మహిళల తరఫున బాక్సర్ మేరికోమ్
మార్చ్‌ఫాస్ట్ లో పాల్గొన్న భారత అథ్లెట్ల జట్లు
మార్చ్‌ఫాస్ట్ లో పాల్గొన్న కామెరూన్
మార్చ్‌ఫాస్ట్ లో పాల్గొన్న కెన్యా
మార్చ్‌ఫాస్ట్ లో పాల్గొన్న ఇటలీ
మార్చ్‌ఫాస్ట్ లో పాల్గొన్న గ్రేట్ బ్రిటన్
మార్చ్‌ఫాస్ట్ లో పాల్గొన్న వెనిజులా
మార్చ్‌ఫాస్ట్ లో పాల్గొన్న USA
దక్షిణాఫ్రికా జట్టు